సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు ఓ వ్యక్తికి రెండోసారి కరోనా వచ్చిన కేసులు ఎక్కడా నమోదు కాలేదని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కరోనా మరణాలను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, తమ ప్రణాళికలకు మంచి ఫలితాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రోజుకి 10 వేలు కేసులు నమోదైనా.. మరణాల రేటు 1 శాతం కంటే తక్కువగా ఉందని వెల్లడించారు. ఎక్కువ కేసులు నమోడవుతున్న అన్ని రాష్ట్రాల కంటే ఏపీలో మరణాల రేటు తక్కువగా ఉందన్నారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి జిల్లాలో కేసులు పెరుగుతున్నయని చెప్పారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. సీరో సర్వేలెన్సు సర్వే 4 జిల్లాల్లో చేపట్టామన్నారు. (‘లక్షణాలు ఉంటే ఆస్పత్రిలో చేరాలి’)
‘అర్బన్ ప్రాంతాల్లోనే ఎక్కువ కేసులుంటున్నాయి. మిగిలిన 9 జిల్లాల్లో కూడా సీరో సర్వేలెన్సు సర్వే చేస్తున్నాం. మన రాష్ట్రంలో 30 రోజులకు కేసులు డబుల్ అవుతున్నాయి. ప్రకాశం, నెల్లూరులో వేగంగా డబుల్ అవుతున్నాయి. 96 శాతం కేసులు కంటైన్మెంట్ క్లస్టర్లలోనే వస్తున్నాయి. కరోనా సోకకుండా ప్రజలను చైతన్యం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం. ప్రజల కోసం 104 కాల్ సెంటర్, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. 204 హాస్పిటల్‌లో పేషెంట్లు ఉన్నారు. 217 హాస్పిటల్స్‌లో హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేశాం. 14 వేలకు పైగా ఫోన్కాల్లకు సమాధానం చెప్పాము. కొన్ని పత్రికల్లో వైద్యులను బాధ కలిగించేలా వార్తలు రాస్తున్నారు. ఓ ప్రధాన పత్రికలో ఖాళీల బోర్డులు పెట్టలేదని పచ్చి అబద్ధాలు రాశారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరం.’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment