
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా ఉల్చాల హరిప్రసాద్, కాకర్ల చెన్నారెడ్డిని నియమించారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హరిప్రసాద్, చెన్నారెడ్డి పేర్లను ఖరారు చేసి గవర్నర్ ఆమోదానికి పంపారు. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును వీరు పర్యవేక్షిస్తారు.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి హిస్టరీలో మాస్టర్స్ డిగ్రీ పొందారు ఉల్చాల హరిప్రసాద్. రెండు దశాబ్ధాలుగా పత్రికారంగంలో కొనసాగారు హరిప్రసాద్. పోస్ట్ గ్రాడ్యుయేట్, లాలో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన కాకర్ల చెన్నారెడ్డి తెలుగు రాష్ట్రాల హైకోర్టులో 15 ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment