Kodali Nani Sensational Comments On Nara Lokesh And Chandrababu Naidu, Details Inside - Sakshi
Sakshi News home page

నారా లోకేష్‌పై కొడాలి నాని ఫైర్‌.. పనికిమాలిన పప్పు నా కొడుకు అంటూ.. 

Published Fri, Oct 21 2022 11:49 AM | Last Updated on Fri, Oct 21 2022 5:39 PM

Kodali Nani Sensational Comments On Nara Lokesh - Sakshi

సాక్షి, గుడివాడ: టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేష్‌పై మాజీ మంత్రి కొడాలి నాని సీరియస్‌ అయ్యారు. పనికిమాలిన పప్పు నా కొడుకు లోకేష్‌.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనికిమాలిన 420 మీడియా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. 

కాగా, కొడాలి నాని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘నారా లోకేష్‌ను పిచ్చి నా కొడుకు అని ప్రజలు అనుకుంటున్నారు. లోకేష్‌కు జయంతికి, వర్థంతికి తేడా తెలియదు. ఎమ్మెల్యేగా గెలవని చవట, దద్దమ్మ లోకేష్‌. లోకేష్‌ పనికిరాని సుంట కాబట్టే.. బాబు పక్క పార్టీపై ఆధారపడుతున్నాడు. సీఎం  వైఎస్‌ జగన్‌ పులి కాబట్టే.. మంగళగిరిలో నువ్వు ఆహారం అయ్యావు. పచ్చి అబద్ధాలు మాట్లాడటం పప్పు లోకేష్‌కు పరిపాటిగా మారింది. 

ఇసుక మీద ఏడాదికి రూ.750 కోట్లు సీఎం జగన్‌.. ప్రభుత్వానికి సమకూరుస్తున్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేయడమే సీఎం జగన్‌ ముఖ్య లక్ష్యం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడమే జగన్‌ లక్ష్యం. సీఎం జగన్‌ మంత్రి వర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. మూడు రాజధానుల మీద చర్చ జరగవద్దనే డైవర్ట్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు. కృత్రిమ మేధావులను సృష్టించి తిట్టిస్తున్నారు. బెల్టు షాపులు రద్దు చేసిన ఘటన సీఎం జగన్‌ది. 

చంద్రబాబు హయంలో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయాన్ని దోచేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న దుర్మార్గుడు చంద్రబాబు. రాష్ట్రంలో పనికిరాని పార్టీలు టీడీపీకి మద్దతు తెలుపుతున్నాయి. డిస్లరీలకు లైసెన్స్‌లు ఇచ్చిన దుర్మార్గుడు చంద్రబాబు. ప్రజల దృష్టి మరల్చడానికే ఎల్లోమీడియాతో దుష్ప్రచారం చేయిస్తున్నారు. మద్యాన్ని ఏరులై పారించిన వ్యక్తి చంద్రాబాబు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్‌ చిత్తుగా ఓడిపోతారు. ఎంగికి మెతుకులకు ఆశపడ్డ వ్యక్తి చంద్రబాబు. బాబు చేసిన వెధవ పనుల వల్లే 420 అంటున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తిరుమలకు వస్తే ఆయనపై చంద్రబాబు చెప్పులు, రాళ్లు వేయించాడు. చంద్రాబాబు అంతటి 420 మరొకరు లేరని ఎస్టీఆరే చెప్పారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మన రాష్ట్రానికి వస్తే నల్ల బెలూన్లతో నిరసన తెలిపారు. అమరావతి పాదయాత్రను స్థానికులు అడ్డుకుంటే అది దారుణామా?. ప్రజాస్వామం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు. ముద్రగడ పద్మనాభంను ఎలా అవమానించారో రాష్ట్రం మొత్తం చూశారు. పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచిన బాబు.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడం ప్రజాస్వామ్యమా?’ అని ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement