![Kommineni Srinivasa Rao Reacted To Eenadu Fake News - Sakshi](/styles/webp/s3/article_images/2023/02/23/Kommineni-Srinivasa-Rao.jpg.webp?itok=KOdLwVQw)
( ఫైల్ ఫోటో )
సాక్షి, అమరావతి: టీడీపీ నేత పట్టాభి ఎపిసోడ్ విషయంలో ఈనాడు తప్పుడు కథనాలు రాసి ప్రచురించిన విషయం తెలిసిందే. కాగా, తప్పుడు కథనాలపై ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్‌రావు స్పందించారు.
ఈ నేపథ్యంలో గురువారం కొమ్మినేని మాట్లాడుతూ.. పట్టాభిని కొట్టారంటూ ఈనాడు పత్రికలో పాత ఫొటోలను ప్రచురించి ప్రజలను మోసగించడం దురదృష్టకరం. 2021 ఫిబ్రవరి 3వ తేదీ నాటి ఫొటోలు ముద్రించడం దారుణం. ప్రభుత్వం, పోలీసులపై ప్రజల్లో వ్యతిరేకత పెంచే లక్ష్యంతోనే కథనం రాసింది. అనంతరం, సాంకేతికలోపం అంటూ సమర్థించుకునే తీరు అభ్యంతరకరం. పట్టాభి వార్తలను బ్యానర్‌గానే కాకుండా పుంఖానుపుంఖాలుగా మూడు పేజీల్లో రాసిన తీరు ఆశ్చర్యం కలిగించింది.
ఈనాడు పత్రికా ప్రమాణాలు, విలువలను దిగజార్చడం బాధాకరం. ఈనాడులో వివరణ ఇవ్వడంలోనూ నిజాయితీ లోపించింది. పట్టాభి పాత ఫొటోలను మొదటి పేజీలో ప్రచురించిన ఈనాడు.. వివరాలను మాత్రం లోపలి పేజీల్లో కనిపించని రీతిలో వేయడం ఆక్షేపణీయం. ఈనాడు మీడియా ఇలాంటి దుష్టపోకడలను మానుకోవాలి అని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment