
సాక్షి, విజయవాడ: నగరంలో న్యాయవాది సుల్తాన్ ముసావీ కుటుంబాన్ని కరోనా కబళించింది. నెల రోజుల్లో కరోనా నలుగురిని బలి తీసుకుంది. అక్టోబర్ 8న న్యాయవాది తల్లి మరణించగా, అక్టోబర్ 30న న్యాయవాది భార్య కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలను మచిలీపట్నంలో నిర్వహిస్తున్న సమయంలోనే న్యాయవాది ముసావీ కూడా తుదిశ్వాస విడిచారు. వారి కుమారుడి ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉండటంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్న సమయంలో కుమారుడు కూడా మరణించారు. కుటుంబం మొత్తం కరోనాతో మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment