
సైదుమియా
గిద్దలూరు రూరల్(ప్రకాశం): చనిపోయాడనుకున్న ఆ వ్యక్తి అంత్యక్రియలు చేసిన అనంతరం 41 రోజుల తర్వాత వారి కళ్ల ముందుకు వచ్చి కనిపించటంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. ఈ సంఘటన గిద్దలూరు మండలంలోని ముండ్లపాడులో జరిగింది. అసలు ఏం జరిగిందంటే.. గ్రామానికి చెందిన పఠాన్ సైదుమియా మద్యానికి బానిసై ఆర్మీ ఉద్యోగం వదిలేసి లారీ క్లీనర్‌గా వెళుతున్నాడు. అతనికి భార్య రహమత్‌బీ, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తలు తరచూ గొడవలు పడి విడిపోయారు. అప్పటినుంచి రహమత్‌బీ తన కుమార్తెతో కలిసి అనుమలవీడులోని తన తల్లి ఇంట్లో ఉంటోంది.
అప్పటి నుంచి ఒంటరిగా ఉంటోన్న సైదుమియా లారీ క్లీనర్‌గా పనికి వెళ్తే ఒక్కోసారి 2, 3 నెలల వరకు గ్రామంలోని ఇంటికి వచ్చేవాడు కాదు. ఈ క్రమంలో 41 రోజుల క్రితం మార్కాపురం రైల్వేస్టేషన్‌లో ఓ వ్యక్తి మృతి చెందాడని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న బంధువులు.. మృతి చెందింది సైదుమియానే అని భావించి మృతదేహాన్ని ముండ్లపాడుకు తీసుకువచ్చారు. భార్య రహమత్‌బీని పిలిపించి వారి పద్ధతుల్లో అంత్యక్రియలు పూర్తిచేశారు. 3 నెలలుగా లారీ క్లీనర్‌గా పని చేసుకుంటూ ఉన్నానని, గ్రామంలో జరిగే పీర్ల చావిడిలో పాల్గొనేందుకు ఇప్పుడు వచ్చానని సైదుమియా తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment