సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. ఆ మధ్య ఫార్మసిస్టు పోస్టుల కోసం పెట్టిన నకిలీ సర్వీసు సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడగా, ఇప్పుడు నకిలీ అపాయింట్‌మెంట్ల వ్యవహారం నడిచింది. అయితే ఇందులో సూత్రధారులెవరో, పాత్రదారులెవరో తెలీని పరిస్థితి ఉంది. ఎక్కడ కేంద్రం చేసుకుని దందా నడపారో కూడా తెలియకుండా మోసగాళ్లు జాగ్రత్త పడ్డారు. అక్రమార్కులెవరో తెరవెనక ఉండి నిరుద్యోగ యువతను మోసగించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల అప్రమత్తతతో ఇప్పుడీ రాకెట్ చేధించే పనిలో పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయి. జిల్లాలో కొందరి పేరిట జారీ అయిన నియామకాల పత్రాలపై విజయవాడ రూర్బన్ మిషన్‌కు చెందిన జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ సంతకం ఉంది.
రీజనల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్‌కు రిపోర్టు చేయాలని ఉంది. అయితే, వాస్తవంగా రూర్బన్ మిషన్ లేదు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ ఎవరో తెలియదు. రీజినల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్ ఆచూకీ లేదు. కానీ వీరి పేరున నియామక పత్రాలు కొందరి పేరున వచ్చేశాయి. ఇప్పటివరకు పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి మూడు నియామక పత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే, ఇవన్నీ బోగస్ నియామకాలే (ఫేక్ అపాయింట్‌మెంట్లు). అలాంటి సంస్థే లేదు. అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకుని తెరవెనుక ఉండి ఎవరో నడిపిస్తున్న బాగోతమిది.
అధికారుల దృష్టికి వెళ్లి..
కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారులకు ఈ ఫేక్ వ్యవహారం వెళ్లింది. అక్కడి నుంచి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటి నియామకాలేవీ జరగలేదని, ఎవరో చేస్తున్న అవినీతి కార్యక్రమమని నిర్ధారణకొచ్చారు. తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓలను అప్రమత్తం చేశారు.
ఫేక్ నియామకాలతో నిరుద్యోగులు మోసపోవద్దని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా పోలీసు స్టేషన్‌లలో కేసు నమోదు చేయాలని పీఆర్,ఆర్‌డీ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం సాయంత్రం యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెడ్పీ సీఈఓ లక్ష్మీపతి వెంటనే సంబంధిత ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాలకొండ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా పంచాయతీల వరకు ఈ సమాచారాన్ని చేరవేశారు.
రంగంలోకి నిఘా సంస్థలు
ఇదే విషయమై ‘సాక్షి’లో శనివారం ప్రాథమిక సమాచారంతో వార్త రావడంతో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అపాయింట్‌మెంట్లు ఇచ్చిందెవరు, నియామక పత్రాలు పొందినదెవరు? తదితర వివరాలను సేకరించే పనిలో పడ్డారు. రహస్యంగా ఏదో జరిగిందని, తెరవెనుక ఉన్నదెవరో తేలాలని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రస్తుతానికి పోలీసులు నకిలీ నియామక పత్రాల గుట్టు రట్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా మోసం చేశారు..
గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్ కింద వివిధ హోదాల్లో పోస్టులను భర్తీ చేసినట్టుగా నియామక పత్రాలు జారీ చేశారు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ్ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఆ నియామక పత్రాల్లో పేర్కొని ఉంది. వాస్తవంగా రూర్బన్ మిషన్ కింద ఎలాంటి నియామకాలు జరగలేదు.
ఇదంతా చూస్తుంటే స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరుతో నియామకాలు చేపడుతున్నట్టు డ్రామాలాడి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, కొన్నాళ్లు రహస్యంగా శిక్షణ పేరుతో కాలయాపన చేసి ఉండొచ్చని, ఇదేదో పెద్ద నకిలీ బాగోతమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కచ్చితమైన అడ్రస్సు లేకుండా జారీ చేసిన నియామక పత్రాలతో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున మోసం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైన నకిలీ నియామక పత్రాలు జారీ చేసి, అక్రమార్కుడెవరో సొమ్ము చేసుకున్నట్టు స్పష్టమవుతోంది.
ఇలా మోసం చేశారు..

Comments
Please login to add a commentAdd a comment