panchyati raj
-
నిరుద్యోగులూ జర భద్రం..ఉద్యోగాల పేరుతో భారీ మోసం
సాక్షి,శ్రీకాకుళం: జిల్లాలో మరో నకిలీ వ్యవహారం బయటపడింది. ఆ మధ్య ఫార్మసిస్టు పోస్టుల కోసం పెట్టిన నకిలీ సర్వీసు సర్టిఫికెట్ల బాగోతం వెలుగు చూడగా, ఇప్పుడు నకిలీ అపాయింట్మెంట్ల వ్యవహారం నడిచింది. అయితే ఇందులో సూత్రధారులెవరో, పాత్రదారులెవరో తెలీని పరిస్థితి ఉంది. ఎక్కడ కేంద్రం చేసుకుని దందా నడపారో కూడా తెలియకుండా మోసగాళ్లు జాగ్రత్త పడ్డారు. అక్రమార్కులెవరో తెరవెనక ఉండి నిరుద్యోగ యువతను మోసగించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారుల అప్రమత్తతతో ఇప్పుడీ రాకెట్ చేధించే పనిలో పోలీసు వర్గాలు నిమగ్నమయ్యాయి. జిల్లాలో కొందరి పేరిట జారీ అయిన నియామకాల పత్రాలపై విజయవాడ రూర్బన్ మిషన్‌కు చెందిన జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ సంతకం ఉంది. రీజనల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్‌కు రిపోర్టు చేయాలని ఉంది. అయితే, వాస్తవంగా రూర్బన్ మిషన్ లేదు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ డి.ప్రవీణ్ ఎవరో తెలియదు. రీజినల్ మేనేజర్ ఇండిపుడి సుధాకర్ ఆచూకీ లేదు. కానీ వీరి పేరున నియామక పత్రాలు కొందరి పేరున వచ్చేశాయి. ఇప్పటివరకు పంచాయతీరాజ్ అధికారుల దృష్టికి మూడు నియామక పత్రాలు వచ్చాయి. ఇంకా ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే, ఇవన్నీ బోగస్ నియామకాలే (ఫేక్ అపాయింట్మెంట్లు). అలాంటి సంస్థే లేదు. అమాయక నిరుద్యోగులను బుట్టలో వేసుకుని తెరవెనుక ఉండి ఎవరో నడిపిస్తున్న బాగోతమిది. అధికారుల దృష్టికి వెళ్లి.. కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ అధికారులకు ఈ ఫేక్ వ్యవహారం వెళ్లింది. అక్కడి నుంచి పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. క్షుణ్ణంగా పరిశీలించాక అలాంటి నియామకాలేవీ జరగలేదని, ఎవరో చేస్తున్న అవినీతి కార్యక్రమమని నిర్ధారణకొచ్చారు. తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీఈఓలను అప్రమత్తం చేశారు. ఫేక్ నియామకాలతో నిరుద్యోగులు మోసపోవద్దని, ప్రజలు ఎవరూ నమ్మవద్దని మీడియా ద్వారా పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా పోలీసు స్టేషన్లలో కేసు నమోదు చేయాలని పీఆర్,ఆర్డీ కమిషనర్ గిరిజాశంకర్ శుక్రవారం సాయంత్రం యుద్ధ ప్రాతిపదికన ఆదేశాలు జారీ చేశారు. దీంతో జెడ్పీ సీఈఓ లక్ష్మీపతి వెంటనే సంబంధిత ఎంపీడీఓలను అప్రమత్తం చేశారు. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఇప్పటికే పాలకొండ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. అంతేకాకుండా పంచాయతీల వరకు ఈ సమాచారాన్ని చేరవేశారు. రంగంలోకి నిఘా సంస్థలు ఇదే విషయమై ‘సాక్షి’లో శనివారం ప్రాథమిక సమాచారంతో వార్త రావడంతో స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ సిబ్బంది రంగంలోకి దిగారు. అపాయింట్మెంట్లు ఇచ్చిందెవరు, నియామక పత్రాలు పొందినదెవరు? తదితర వివరాలను సేకరించే పనిలో పడ్డారు. రహస్యంగా ఏదో జరిగిందని, తెరవెనుక ఉన్నదెవరో తేలాలని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. ప్రస్తుతానికి పోలీసులు నకిలీ నియామక పత్రాల గుట్టు రట్టు చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇలా మోసం చేశారు.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్ కింద వివిధ హోదాల్లో పోస్టులను భర్తీ చేసినట్టుగా నియామక పత్రాలు జారీ చేశారు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ్ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఆ నియామక పత్రాల్లో పేర్కొని ఉంది. వాస్తవంగా రూర్బన్ మిషన్ కింద ఎలాంటి నియామకాలు జరగలేదు. ఇదంతా చూస్తుంటే స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరుతో నియామకాలు చేపడుతున్నట్టు డ్రామాలాడి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, కొన్నాళ్లు రహస్యంగా శిక్షణ పేరుతో కాలయాపన చేసి ఉండొచ్చని, ఇదేదో పెద్ద నకిలీ బాగోతమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కచ్చితమైన అడ్రస్సు లేకుండా జారీ చేసిన నియామక పత్రాలతో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున మోసం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైన నకిలీ నియామక పత్రాలు జారీ చేసి, అక్రమార్కుడెవరో సొమ్ము చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇలా మోసం చేశారు.. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన రూర్బన్ మిషన్ కింద వివిధ హోదాల్లో పోస్టులను భర్తీ చేసినట్టుగా నియామక పత్రాలు జారీ చేశారు. జోనల్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రవీణ్ పేరుతో సుధాకర్ అనే వ్యక్తి పేరుతో నియామక పత్రాలు జారీ అయ్యాయి. 15 రోజుల్లోగా జాయిన్ కావాలని ఆ నియామక పత్రాల్లో పేర్కొని ఉంది. వాస్తవంగా రూర్బన్ మిషన్ కింద ఎలాంటి నియామకాలు జరగలేదు. ఇదంతా చూస్తుంటే స్మార్ట్ విలేజ్, రూర్బన్ మిషన్ పేరుతో నియామకాలు చేపడుతున్నట్టు డ్రామాలాడి, నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి, కొన్నాళ్లు రహస్యంగా శిక్షణ పేరుతో కాలయాపన చేసి ఉండొచ్చని, ఇదేదో పెద్ద నకిలీ బాగోతమని అధికార వర్గాలు భావిస్తున్నాయి. కచ్చితమైన అడ్రస్సు లేకుండా జారీ చేసిన నియామక పత్రాలతో నిరుద్యోగ యువతను పెద్ద ఎత్తున మోసం చేసినట్టు స్పష్టమవుతోంది. ఒక్క శ్రీకాకుళంలోనే కాదు విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కూడా ఇదే రకమైన నకిలీ నియామక పత్రాలు జారీ చేసి, అక్రమార్కుడెవరో సొమ్ము చేసుకున్నట్టు స్పష్టమవుతోంది. -
సీఎం జగన్ మరో కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిచడం చట్ట విరుద్ధమని హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు తీర్పుతో ప్రభుత్వం నిర్ణయించిన 34 శాతానికి బదులుగా.. బీసీలకు 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు అమలుకానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 10 శాతం సీట్లు పార్టీ తరుపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకున్న 10 శాతం పదవులను పార్టీ బీ ఫామ్‌ల ద్వారా అదనంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు మొత్తం 34 శాతం రిజర్వేషన్లు పొందనున్నారు. (రిజర్వేషన్లు 50% మించొద్దు) ఈ మేరకు పార్టీ నిర్ణయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ పార్టీ నేతలతో కలిసి శనివారం వెల్లడించారు. సీఎం జగన్ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీలకు 19.08 శాతం, ఎస్టీలకు 6.77 శాతం, బీసీలకు 34 శాతం.. మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 డిసెంబర్ 28న ప్రభుత్వం జీవో 176ను జారీ చేసిన విషయం తెలిసిందే. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను సవాలు చేస్తూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌రెడ్డి, మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. (ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు) ఆయా వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయస్థానం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టంలోని పలు సెక్షన్లను చట్ట విరుద్ధమని ప్రకటించింది. రిజర్వేషన్లు 50 శాతం దాటడానికి వీల్లేదని, అలా జరగడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. టీడీపీ నేతల కుట్ర కారణంగా బీసీలు తీవ్ర నిరాశ చెందారు. ఈ నేపథ్యంలోనే వెనుకబడిన బీసీలకు అన్యాయం జరగకుండా ఉండాలని సుధీర్ఘ ఆలోచన చేసిన సీఎం జగన్.. పార్టీ నుంచి అదనంగా 10శాతం సీట్లును బీసీలకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో ముందే సంకల్పించిన విధంగా బీసీలకు మొత్తం 34శాతం రిజర్వేషన్లు అమలుకానున్నాయి. -
ఏపీ జిల్లా పరిషత్ రిజర్వేషన్లు ఖరారు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్ధల ఎన్నికల్లో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం 1994 సెక్షన్ 181, సబ్ సెక్షన్ 2 ప్రకారం రిజర్వేషన్లను ఖరారు చేస్తూ శుక్రవారం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. మొత్తం 13 జిల్లాలకు గాను మహిళలకు ఏడు స్థానాలు (రెండు బీసీ) రిజర్వు కాగా, నాలుగు స్థానాలు జనరల్, ఎస్సీలకు రెండు, ఎస్టీలకు ఒక స్థానం చొప్పున రిజర్వు చేయబడ్డాయి. జిల్లాల వారిగా రిజర్వేషన్లు... 1 ) అనంతపురం : బీసీ మహిళ 2) చిత్తూరు : జనరల్ 3) తూర్పుగోదావరి : ఎస్సీ 4) గుంటూరు : ఎస్సీ మహిళ 5) కృష్ణా : జనరల్ మహిళ 6) కర్నూలు : జనరల్ 7) ప్రకాశం : జనరల్ మహిళ 8) నెల్లూరు : జనరల్ మహిళ 9) శ్రీకాకుళం : బీసీ మహిళ 10) విశాఖపట్నం : ఎస్టీ మహిళ 11) విజయనగరం : జనరల్ 12: పశ్చిమ గోదావరి : బీసీ 13) కడప : జనరల్ -
ఇదేనా స్వచ్ఛ భారత్?
కూడేరు : పారిశుద్ధ్యం పట్ల మండల అభివృద్ధి అధికారి , పంచాయతీ అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తున్నారు. దీంతో గ్రామాల్లో డ్రైనేజీలు శుభ్రతకు నోచుకోలేదు. మురుగు నీరు రోడ్లపైనే ప్రవహిస్తోంది. దీంతో దోమలు ప్రబలి ప్రజలు విష జ్వరాల బారిన పడి ఆస్పత్రుల చుట్టూ తిరుగుతూ నరకయాతన అనుభవిస్తున్నారు. కూడేరు మండలంలో 14 పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండల అభివృద్ధి కార్యాలయం (ఎంపీడీఓ) ఆవరణలోనే చెత్తా చెదారంతో కంపు కొడుతోందంటే అధికారులు పారిశుద్ధ్యం మెరుగునకు ఏ స్థాయిలో కృషి చేస్తున్నారో ఆర్థం చేసుకోవచ్చు. వీధుల్లో ఉన్న చెత్తను మూడు చక్రాల బండిలో తెచ్చి ఎంపీడీఓ కార్యాలయ గేటు ముందు పడేస్తున్నారు. అందులో స్థానికులు కొందరు మలమూత్ర విసర్జన చేయడంతో కంపు కొడుతోంది. ఈ కంపును దాటుకొని మండల ప్రజలు అంగన్వాడీ కేంద్రం, ఐకేపీ కార్యాలయం, హౌసింగ్ ఆఫీసర్, హార్టికల్చర్ కార్యాలయాల్లోకి వెళ్లాల్సి వస్తోంది. గత్యంతరం లేక ప్రజలు ముక్కు మూసుకొని వెళుతున్న పరిస్థితి నెలకొంది. రోజు అధికారులు ఈ కంపును చూస్తు వెళుతున్నారే తప్ప శుభ్రం చేయిద్దామన్న ఆలోచన లేదని ప్రజలు నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం
సాక్షి, గుంటూరు: జిల్లాలో గ్రామీణ రహదారులకు త్వరలో మోక్షం కలగనుంది. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలు మినహాయించి జిల్లాలో మిగిలిన 15 నియోజకవర్గాల పరిధిలో 171 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి పంచాయతీ రాజ్ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) ఫేజ్-2 కింద జిల్లా పంచాయతీ రాజ్ అధికారులు పంపిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర పడింది. గత మూడేళ్ల నుంచి కేంద్రం గ్రామీణ రహదారుల నిర్మాణానికి పీఎంజీఎస్‌వై నిధులు విడుదల చేయడం లేదు. దీంతో రహదారులు మొత్తం పాడయ్యాయి. కొన్ని రూపు రేఖలు మారిపోయాయి. గతంలో పీఎంజీఎస్‌వై కింద శివారు గ్రామాలను కలిపే విధంగా 7.5 కిలోమీటర్ల వరకు లింకు రోడ్లు నిర్మించారు. ఈ దఫా పీహెచ్‌సీలు, స్కూల్స్, మార్కె టింగ్ సౌకర్యాలు కల్పించే విధంగా రోడ్లను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందిం చారు. జిల్లాలో 16 రోడ్లను రూ.99.58 కోట్లతో నిర్మించేందుకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపినట్లు పంచాయతీ రాజ్ శాఖ ఎస్.ఇ. సి.సూర్యనారాయణ ‘సాక్షి’కి తెలిపారు. ‘సాక్షి’ దినపత్రికలో శుక్రవారం ‘సమర సాక్షి’ శీర్షికన జిల్లాలోని రహదారుల దుస్థితిపై ‘ప్రయాణానికి దారేదీ!?’ అంటూ కథనం వెలువడిన సంగతి తెలిసిందే. ‘సాక్షి’ ఈ కథనాన్ని పంచాయతీ రాజ్ ఎస్.ఇ. సూర్యనారాయణ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై స్పందించిన ఆయన త్వరలో గ్రామీణ రహదారులకు మోక్షం కలగనున్నట్లు వివరించారు. ఇటీవల ఢిల్లీలో పీఎంజీఎస్‌వై నిధుల కేటాయింపుపై సాధికారత కమిటీ (ఎంపవర్డ్ కమిటీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పంచాయతీ రాజ్ ఇంజినీర్ ఇన్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి హాజరయ్యారు. రాష్ట్రానికి పీఎంజీఎస్‌వై ఫేజ్-2 కింద నిధులు విడుదల చేయనున్నట్లు సాధికారత కమిటీ పేర్కొంది. దీనిలో భాగంగా జిల్లాకు రూ.99.58 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందని, త్వరలో జీవో విడుదల కానుందని ఎస్ఈ తెలిపారు.