సాక్షి, విజయవాడ: దమ్ముంటే చంద్రబాబు.. పుంగనూరులో పోటీ చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో ఓడిపోయినా చంద్రబాబుకు కనువిప్పు కలగలేదని ఆయన ధ్వజమెత్తారు.
‘‘కుప్పం ఓటమితో చంద్రబాబులో అసహనం విపరీతంగా పెరిగింది. కరోనా కష్టకాలంలో కూడా చంద్రబాబు కుప్పం వైపు చూడలేదు. ఇప్పుడు కుప్పంలో ఓటమిపాలయ్యే సరికి ప్రజలు గుర్తుకొచ్చారు. పులివెందుల, పుంగనూరు వచ్చి చంద్రబాబు ఏం చేస్తారు?.చంద్రబాబు అక్రమంగా మిథున్‌రెడ్డిని 15 రోజులు జైల్లో పెట్టించాడు. గతంలో చంద్రబాబు పథకాలు వాళ్ల అబ్బ సొత్తుతో అమలు చేశారా?’’ అంటూ పెద్దిరెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్.. సంక్షేమ పాలన చేస్తున్నారని ఆయన అన్నారు.
చదవండి:
బాబు బూతు పురాణం: రెచ్చగొట్టి.. రచ్చచేసి!
నాకు సీఎం పదవి అవసరమా?: చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment