
కర్నూలు (సెంట్రల్): ప్రభుత్వ పోర్టల్ ద్వారానే సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో విక్రయించాలని జాయింట్ కలెక్టర్ రామసుందర్‌రెడ్డి థియేటర్ల యజమానులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయన డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఆర్‌డీఓలతో కలసి థియేటర్ల యజమానులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీఓ నంబర్ 69 ప్రకారం సినిమా టిక్కెట్లను ప్రభుత్వ పోర్టల్ ద్వారానే విక్రయించాలన్నారు. సినిమా ప్రదర్శన కంటే ఏడు రోజుల ముందు టిక్కెట్లను విక్రయించరాదన్నారు. బుక్ చేసుకున్న టిక్కెట్‌ను వినియోగదారుడు నాలుగు గంటల ముందు రద్దు చేసుకుంటే జీఎస్టీ, సర్వీసు చార్జీలను మినహాయించి మిగిలిన మొత్తాన్ని వారి ఖాతాలకు జమ చేయాలన్నారు. కార్యక్రమంలో పత్తికొండ, ఆదోని, కర్నూలు ఆర్‌డీఓలు మోహన్‌దాస్, రామకృష్ణారెడ్డి, హరిప్రసాద్ పాల్గొన్నారు. (క్లిక్: టెన్త్ విద్యార్థులకు తీపి కబురు)
Comments
Please login to add a commentAdd a comment