
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో విజయవాడ ఎంపీ కేశినేని నాని భేటీ ముగిసింది. బుధవారం మధ్యాహ్నాం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. కేశినేని నాని వెంట ఆయన కుమార్తె శ్వేత కూడా ఉన్నారు.
కాగా విజయవాడ ఎంపీ అయిన కేశినేని టీడీపీ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. నాని బాటలో ఆయన కూతురు కూడా టీడీపీకి గుడ్‌బై చెప్పారు. విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ అయిన ఆమె తన పదవికి రాజీనామా సమర్పించారు.
చదవండి: ఈ ఏడుపంతా.. మోసాల బాబు కోసమే కదా!