Online Marriage Registration Available In Andhra Pradesh - Sakshi
Sakshi News home page

ఏపీ: ఇక ఆన్‌లైన్‌లోనే వివాహ రిజిస్ట్రేషన్‌

Published Sun, Jan 8 2023 8:24 AM | Last Updated on Sun, Jan 8 2023 9:30 AM

Online Marriage Registration Available In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఇక వివాహ రిజిస్టేషన్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్‌లైన్‌లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్‌ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్‌ చేసుకునేవాళ్లు సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్‌ పూర్తి చేసి సబ్‌ రిజిస్ట్రార్‌కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లోనే జరగనుంది.   
ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే.. 

www.registrations.ap.gov.inలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్‌ చేసి మొబైల్‌ నంబర్‌ లేదా ఇ–మెయిల్‌ ద్వారా ఓటీపీతో లాగిన్‌ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఆన్‌లైన్‌లోనే ఫామ్‌ని పూర్తి చేసి, ఆధార్‌ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సరి్టఫికెట్లు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్‌కి ఆఫీసుకు వెళ్లేందుకు స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. రిజి్రస్టేషన్ల చట్టం ప్రకారం.. కచ్చితంగా రిజిస్ట్రార్‌ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్‌ బుక్‌ చేసుకుని సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయానికి వెళ్లాలి. సమగ్ర ఆరి్థక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్‌ఎంఎస్‌) ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చలానా ద్వారా కట్టే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తును సబ్‌ రిజిస్ట్రార్‌కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి.. సాక్షులతో సంతకా­లు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్‌ను జారీ చేస్తా­రు. రిజిస్ట్రేటేషన్‌ అయ్యాక సర్టిఫికెట్‌లో వాళ్ల ఫొటోలూ జతచేస్తున్నారు. ఆ తర్వాత అదే ఆన్‌లైన్‌లోనూ వస్తుంది.మొన్నటివరకు ఒకరోజు త­ర్వాత సర్టిఫికెట్‌ ఇస్తుండగా ఆన్‌లైన్‌లో వెంటనే రా­నుంది.

ప్రత్యేక వివాహాలకు ఇలా.. 
హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజి్రస్టేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా అవకాశం కలి్పంచారు. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్‌ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజి్రస్టార్‌ కార్యాల­యం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు.       

మరింత మెరుగ్గా సేవలు.. 
ఈ ఆన్‌లైన్‌ విధానానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఫిజికల్‌ సిగ్నేచర్‌ కాకుండా డిజిటల్‌ సిగ్నేచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చలానా కట్టే విధానాన్ని ఇంకా సులభతరం చేయనున్నారు. ఫోన్‌ పే, గూగుల్‌ పే వంటి వాటి ద్వారా కూడా చెల్లించే అవకాశం కలి్పంచనున్నారు. అలాగే ఆధార్‌ అథెంటికేషన్‌ను కూడా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా వివాహ రిజి్రస్టేషన్లను ఆన్‌లైన్‌లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని లాంఛనంగా పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. అప్పటివరకు వివాహ రిజి్రస్టేషన్లు ప్రయోగాత్మకంగా ఆన్‌లైన్‌లో జరగనున్నాయి. 

పక్కాగా వివాహ సమాచారం
ఆన్‌లైన్‌ విధానం వల్ల వివాహ సమాచారం పక్కాగా ఉంటుంది. ఏ రోజు ఎన్ని పెళ్లిళ్లు జరిగాయనే వివరాలు ఉంటాయి. ప్రస్తు­తం ఏటా 3 నుంచి 4 లక్షల హిందూ వివాహాలు నమోదవుతున్నాయి. అలాగే 50 వేల లోపు ప్రత్యేక వివాహాలు జరుగుతున్నాయి. ఆన్‌లైన్‌ విధానంతో వీటి రిజి్రస్టేషన్లు సులభతరం కానున్నాయి.
– వి.రామకృష్ణ, కమిషనర్‌, అండ్‌ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ.    
     

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement