Marriage Registrations
-
ఏటా జరిగే వివాహాలు 2.5 లక్షలు..
సాక్షి, హైదరాబాద్: వివాహ రిజిస్ట్రేషన్లు ఓ మోస్తరుగానే జరుగుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. ఏటా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.5 లక్షల పెళ్లిళ్లు జరుగుతాయనే అంచనా ఉండగా, రిజిస్ట్రేషన్లు మాత్రం లక్షలోపే ఉంటున్నాయని లెక్కలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా గత ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019–20 సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఏటా సుమారు 90 వేలకు పైగా మాత్రమే వివాహ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఐదేళ్ల కాలంలో కూడా ఈ సంఖ్యలో మార్పు లేకపోవడం విశేషం. అయితే..2023–24లో మాత్రం ఈ రిజిస్ట్రేషన్లు స్వల్పంగా పెరిగాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ తాజా నివేదికలో వెల్లడైంది. ఈ ఏడాదిలో అత్యధికంగా 1.09 లక్షల వివాహ రిజిస్ట్రేషన్లు జరిగాయని తేలింది. జిల్లాల వారీగా పరిశీలిస్తే గ్రేటర్ పరిధిలోనే 40 శాతం వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. 2023–24 సంవత్సర గణాంకాలను పరిశీలిస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 15,733 రిజిస్ట్రేషన్లు జరిగాయి. రంగారెడ్డిలో 13,502, హైదరాబాద్ జిల్లాలో 10,925 మంది తమ వివాహాలను రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత కరీంనగర్లో 14,027, వరంగల్ జిల్లాలో 11,565 మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఈ ఐదు జిల్లాల్లోనే సగం రిజిస్ట్రేషన్లు జరగ్గా, మిగిలిన ఏడు రిజి్రస్టేషన్ జిల్లాల్లో కలిపి మరో సగం జరగడం గమనార్హం. ఏ డాక్యుమెంట్లు కావాలంటే...! వివాహ రిజిస్ట్రేషన్ల విషయంలో అలసత్వం వద్దని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకు పెద్దగా సమయం పట్టదని, స్లాట్ బుక్ అయిన రోజునే పూర్తవుతుందంటున్నారు. అయితే డాక్యుమెంట్లు పూర్తిస్థాయిలో సమర్పించాల్సి ఉంటుందని చెబుతున్నారు. పెళ్లి పత్రిక, 2 పెళ్లి ఫొటోలు, వధూవరుల ఆధార్‌కార్డులు, వయసు ధ్రువీకరణ పత్రం, ముగ్గురు సాక్షులు, వారి ఆధార్ కార్డులు తప్పకుండా ఉండాలి. వివాహానికి చట్టబద్ధత కల్పించడంతోపాటు విదేశాలకు వెళ్లాలనుకునే దంపతులకు ఈ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో ఇటీవలి కాలంలో వివాహాల రిజిస్ట్రేషన్లు పెరిగాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆధార్ కార్డులో చిరునామా మార్పు కావాలన్నా, కొత్త రేషన్‌కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా ఈ సర్టిఫికెట్ అవసరం. అయితే, కల్యాణలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు కూడా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అవసరమవుతోంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి కోసం ఏడాదికి 2 లక్షలకు పైగా దరఖాస్తులు వస్తుండగా, అందులో ఎక్కువగా స్థానిక సంస్థలు (గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు) ఇచ్చే వివాహ ధ్రువపత్రాలే ఎక్కువగా ఉంటున్నాయి. అయితే, స్థానిక సంస్థల్లో ధ్రువపత్రాలు ఒకసారి, వివాహాల రిజిస్ట్రేషన్లు మరోసారి కాకుండా నేరుగా సబ్‌రిజి్రస్టార్ కార్యాలయాల్లో వివాహ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఇతర అవసరాలకు కూడా వినియోగించుకోవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. గతం కంటే అవగాహన పెరిగింది కానీ..అది సరిపోదని, ప్రజల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉంది. జరిగే ప్రతి వివాహం రిజి్రస్టేషన్ అయితేనే అన్ని విధాలుగా మంచిదని సూచిస్తున్నాయి. -
ఏపీ: ఇక ఆన్లైన్లోనే వివాహ రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: ఇక వివాహ రిజిస్టేషన్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే నమోదు చేసుకునే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో వివాహ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. త్వరలో పూర్తి స్థాయిలో ఈ విధానం అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలను సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో మాన్యువల్‌గా రిజిస్టర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు అవసరమైన ఫొటోలు, ఆధార్ కార్డ్‌లు, ముగ్గురు సాక్షులతో రిజిస్ట్రేషన్ చేసుకునేవాళ్లు సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లి సంబంధిత ఫామ్ పూర్తి చేసి సబ్ రిజిస్ట్రార్‌కి ఇచ్చేవారు. ఆయన దాన్ని సరిచూసి పుస్తకంలో నమోదు చేసుకునేవారు. ఆ తర్వాత సర్టిఫికెట్‌పై సంతకం పెట్టి దాన్ని ఇచ్చేవాళ్లు. ఇకపై ఈ ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే జరగనుంది. ఇక నుంచి ఆన్లైన్లోనే.. www.registrations.ap.gov.inలో హిందూ వివాహాలు, ప్రత్యేక వివాహాలు అనే రెండు ఆప్షన్లు ఉన్నాయి. హిందూ వివాహమైతే దానిపై క్లిక్ చేసి మొబైల్ నంబర్ లేదా ఇ–మెయిల్ ద్వారా ఓటీపీతో లాగిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే ఫామ్‌ని పూర్తి చేసి, ఆధార్ కార్డ్‌లు, పెళ్లి ఫొటోలు, పదో తరగతి సరి్టఫికెట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రిజిస్ట్రార్‌కి ఆఫీసుకు వెళ్లేందుకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజి్రస్టేషన్ల చట్టం ప్రకారం.. కచ్చితంగా రిజిస్ట్రార్ ముందు హాజరు కావాలని ఉండడంతో స్లాట్ బుక్ చేసుకుని సబ్ రిజి్రస్టార్ కార్యాలయానికి వెళ్లాలి. సమగ్ర ఆరి్థక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ ఫీజును ఆన్లైన్లో చలానా ద్వారా కట్టే అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసిన దరఖాస్తును సబ్ రిజిస్ట్రార్‌కి ఇస్తే ఆయన దాన్ని పరిశీలించి.. సాక్షులతో సంతకాలు పెట్టించుకుని వెంటనే సర్టిఫికెట్‌ను జారీ చేస్తారు. రిజిస్ట్రేటేషన్ అయ్యాక సర్టిఫికెట్లో వాళ్ల ఫొటోలూ జతచేస్తున్నారు. ఆ తర్వాత అదే ఆన్‌లైన్‌లోనూ వస్తుంది.మొన్నటివరకు ఒకరోజు తర్వాత సర్టిఫికెట్ ఇస్తుండగా ఆన్లైన్లో వెంటనే రానుంది. ప్రత్యేక వివాహాలకు ఇలా.. హిందూ వివాహ చట్టం ప్రకారం కాకుండా జరిగిన పెళ్లిళ్లను ప్రత్యేక వివాహాల కింద రిజి్రస్టేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి వెబ్సైట్లో ప్రత్యేకంగా అవకాశం కలి్పంచారు. దీనికి ఒక నెల నోటీసు పీరియడ్ ఉంటుంది. అంటే నెల ముందు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే దానిపై రిజి్రస్టార్ కార్యాలయం అభ్యంతరాల స్వీకరణకు బోర్డులో నోటీసును పెడుతుంది. అభ్యంతరాలు లేకపోతే నెల తర్వాత వెంటనే రిజిస్ట్రేషన్‌ను పూర్తి చేసుకోవచ్చు. మరింత మెరుగ్గా సేవలు.. ఈ ఆన్లైన్ విధానానికి ఇంకా మెరుగులు దిద్దుతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఫిజికల్ సిగ్నేచర్ కాకుండా డిజిటల్ సిగ్నేచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. సీఎఫ్ఎంఎస్ ద్వారా చలానా కట్టే విధానాన్ని ఇంకా సులభతరం చేయనున్నారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి వాటి ద్వారా కూడా చెల్లించే అవకాశం కలి్పంచనున్నారు. అలాగే ఆధార్ అథెంటికేషన్‌ను కూడా ఆన్లైన్లోనే పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నారు. తద్వారా వివాహ రిజి్రస్టేషన్లను ఆన్లైన్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఆ తర్వాత ఈ విధానాన్ని లాంఛనంగా పూర్తిస్థాయిలో ప్రారంభించనున్నారు. అప్పటివరకు వివాహ రిజి్రస్టేషన్లు ప్రయోగాత్మకంగా ఆన్లైన్లో జరగనున్నాయి. పక్కాగా వివాహ సమాచారం ఆన్లైన్ విధానం వల్ల వివాహ సమాచారం పక్కాగా ఉంటుంది. ఏ రోజు ఎన్ని పెళ్లిళ్లు జరిగాయనే వివరాలు ఉంటాయి. ప్రస్తుతం ఏటా 3 నుంచి 4 లక్షల హిందూ వివాహాలు నమోదవుతున్నాయి. అలాగే 50 వేల లోపు ప్రత్యేక వివాహాలు జరుగుతున్నాయి. ఆన్లైన్ విధానంతో వీటి రిజి్రస్టేషన్లు సులభతరం కానున్నాయి. – వి.రామకృష్ణ, కమిషనర్, అండ్ ఐజీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. -
ఊరిలోనే పెళ్లి రిజిస్ట్రేషన్..
సాక్షి, వనపర్తి: ఇప్పటి వరకు వివాహా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చేది. దీంతో ప్రజలు అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ప్రజల ఇబ్బందులు గుర్తించిన ప్రభుత్వం వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో మార్పు లు చేసింది. ఇకపై వివాహం జరిగిన పంచాయతీలోనే కార్యదర్శితో పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ విషయంపై అవగాహన కల్పిం చేందుకు శుక్రవారం జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో పంచాయతీ కార్యదర్శులకు, మున్సిపల్ కమిషనర్లకు, ఎంపీడీఓలకు జిల్లా వెల్పేర్ అధికారి ఆధ్వర్యంలో ఒక్కరోజు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మహిళా శక్తి కేంద్రం మహబూబ్‌నగర్ కో–ఆర్డినేటర్ అరుణ మారిన నిబంధనలు, పెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకునే అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పెళ్లిళ్ల రిజిస్ట్రార్‌గా కలెక్టర్, అదనపు రిజిస్టార్‌గా జిల్లా సంక్షేమ అధికారి పని చేస్తారని చెప్పారు. 30రోజుల్లో అయితే ఉచితంగానే.. వివాహం జరిగిన రోజు నుంచి 30 రోజుల్లోగా సంబంధిత పంచాయతీ కార్యద ర్శితో పెళ్లి కుమారుడుగాని, పెళ్లికూతురుగాని ఎవరి తల్లితండ్రులైనా.. కార్యదర్శి వద్దకు వచ్చి రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. ఈ దరఖాస్తుపై ఇరుపక్షాల సాక్షులు సంతకాలు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులో పెళ్లి కుమారుడు, పెళ్లి కూతురు వయస్సు తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. కార్యదర్శి పంచాయతీ కార్యాలయంలో పెళ్లిళ్ల రిజిస్టర్లో నమోదు చేస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు వచ్చిన వారితో సంతకాలు తీసుకోవాల్సి ఉంటుంది. రెండు నెలల్లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రూ. 100ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. మున్సిపాలిటీ కేంద్రాల్లో జరిగిన పెళ్లిల వివరాలు మున్సిపల్ కమిషనర్ రిజిస్టర్లో వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే చట్టబద్దత ఉంటుందన్నారు. కుటుంబానికి వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలు ఈ రిజిస్ట్రేషన్ ఎంతో దోహదపడుతుంది. కార్యక్రమంలో జిల్లా వెల్పేర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజినీకాంత్‌రెడ్డి, ఎంపీడీఓలు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
పవిత్ర బంధం.. రిజిస్ట్రేషన్ చేద్దాం
సాక్షి, సిటీబ్యూరో :గ్రేటర్ హైదరాబాద్‌లో వివాహాలు జోరందుకున్నాయి. నగరంలో ఒక్క ఆదివారమే వేల సంఖ్యలోనే పెళ్లిళ్లు జరిగినట్లు అంచనా. వీటి కోసం రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. వివాహాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడంలేదు. భారీగా ఖర్చుపెట్టి పెళ్లి చేసుకుంటున్న వారు రూ.200 వెచ్చించి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పెద్దగా ఆసక్తికనబరచడంలేదు. వాస్తవంగా వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సమస్యలను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. దాంపత్య బంధానికి మరింత బలం చేకూరనుందనే విషయాన్ని ప్రతిఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంది. ప్రయోజనాలు ఇలా.. ♦ విడాకులు, భరణం, పిల్లల సంరక్షణ, ఆస్తుల వివాదాల్లో వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రాలను పరిగణనలోకి తీసుకుంటారు ♦ రెండో వివాహాన్ని అడ్డుకునేందుకు ఉపయుక్తం ♦ ప్రేమ పేరుతో జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు ♦ వరకట్నం, శారీరక, మానసిక వేధింపులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకునే వీలు ♦ వీసా, పాస్‌పోర్టు, ఇంటిపేరు మార్పు వంటి వాటికి తప్పనిసరిగా వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం పొందుపర్చాలి ♦ ప్రభుత్వ ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకాలు పొందే వీలు ♦ భాగస్వామి మరణించిన సందర్భంలో ప్రభుత్వ నుంచి ప్రయోజనాలు పొందవచ్చు ♦ ఆస్తుల వ్యవహారంలో లీగల్ హైర్ సర్టిఫికెట్ పొందేందుకు ఉపయోగపడుతుంది ♦ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా వివాహరిజిస్ట్రేషన్ ధ్రువీకరణ పత్రం పొందుపర్చాల్సి ఉంటుంది ♦ దివ్యాంగులకు, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ పారితోషికంఅందాలంటే వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి గృహహింస, వరకట్న వేధింపులు, చిన్న చిన్న కారణాలతో ఎంతో మంది దంపతులు విడిపోతున్నారు. దీంతో వారి పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోంది. ప్రేమ వివాహాలు, పెద్దలని ఎదిరించి పెళ్లి చేసుకున్నవారి ఇళ్లలో ఈ సమస్యలు ఎక్కువ ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వివాహ రిజిస్ట్రేషన్ ఒక ఆయుధంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఎటువంటి సమస్యలైనా సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ ఎలా చేయాలంటే.. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెంటనే ధ్రువీకరణ పత్రం అందిస్తారు. ఇందుకు రూ.200 రుసుం చెల్లించాల్సి ఉంటుంది. జీహెచ్ఎంసీ కార్యాలయాల్లోనూ చేసుకోవచ్చు. ప్రేమ వివాహాల విషయంలో.. ప్రేమ వివాహం చేసుకున్నవారు సంబంధిత కార్యాలయంలో మూడు దరఖాస్తులనుసమర్పించాలి. ఒక దరఖాస్తు అధికారుల వద్ద, మరో దరఖాస్తు అదే కార్యాలయంలో నోటీసు బోర్డులో ఉంటుంది. మూడో దరఖాస్తును దరఖాస్తుదారుల సొంతూరికి పంపిస్తారు. నెల రోజుల గడువు అనంతరం ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే సాక్షి సంతకాలు, ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలు పరిశీలించి రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆర్య సమాజ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారిచ్చే ధ్రువీకరణ పత్రం ఆధారంగా రిజిస్ట్రేషన్ చేస్తారు.నివాస ధ్రువీకరణ పత్రం, వివాహం జరిగినట్లు ఆహ్వాన పత్రిక, వివాహ సమయంలో తీసుకున్న ఫొటోలు, ముగ్గురు సాక్షుల డిక్లరేషన్, వధూవరుల డిక్లరేషన్, ఆధార్ కార్డు పొందుపర్చాల్సి ఉంటుంది. ఇవీ అర్హతలు.. వధువుకు 18 ఏళ్లు,వరుడికి 21 ఏళ్లు దాటి ఉండాలి వయసు ధ్రువీకరణకు సంబంధించిపదో తరగతి మార్కులు జాబితాపొందుపర్చాలి -
పంచాయతీకి చేరిన పెళ్లి..!
సాక్షి, వైరా: గ్రామాల్లోనే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకునే నూతన విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీంతో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో పాటు ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు త్వరితగతిన అందే అవకాశం ఉంటుంది. గ్రామ కార్యదర్శులకు వివాహం రిజిస్ట్రేషన్ చేసే అధికారాన్ని ఇస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచే అమల్లోకి.. కాగా ఈ విధానం నేటి నుంచి అమలులోకి రానుంది. పంచాయతీ కార్యదర్శులతో పాటు మండలంలోని ఈఓపీఆర్డీలు ఈ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నారు. పెళ్లి రిజిష్ట్రేషన్‌కు నామమాత్రపు రుసుము చెల్లించాలి. రెండు నెలల గడువు దాటితే రూ.100 చెల్లించి గ్రామ పంచాయతీల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆపై గడువుదాటితే రిజిష్ట్రేషన్ కార్యాలయంలో నమోదు చేసుకోవాలి. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా ఆర్థికసాయం పొందేందుకు ఈ రిజిస్ట్రేషన్ తప్పని సరి. పంచాయతీల్లో నమోదు చేసుకోవాలి గ్రామాల్లో జరుగుతున్న వివాహాలను ఇక నుంచి తప్పని సరిగా గ్రామ పంచాయతీలో నమోదు చేసుకోవాలి. దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథక ఫలాలను త్వరిత గతిన పొందే అవకాశం ఉంది. – శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, ఖమ్మం -
ఇక పల్లెల్లోనే వివాహ రిజిస్ట్రేషన్లు
భైంసాటౌన్(ముథోల్): ఇప్పటివరకు వివాహ రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. పట్టణాలతో పాటు మారుమూల గ్రామాల్లో జరిగే వివాహాలను సైతం ఈ కార్యాలయాల్లోనే నమోదు చేసుకోవాల్సి వచ్చేది. దీంతో వారికి దూరభారంతోపాటు వ్యయభారం తప్పేది కాదు. దీంతో చాలామంది వివాహ నమోదు చేసుకునేవారు కాదు. అయితే తెలంగాణ ప్రభుత్వం షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టిన తరువాత చాలామంది వివాహ నమోదుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే ఈ పథకాల కింద అందిస్తున్న ఆర్థిక సాయం పొందాలంటే లబ్ధిదారులు ఖచ్చితంగా వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జతచేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వారు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై గ్రామాల్లోనూ వివాహాల రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీ కార్యదర్శులే వివాహ నమోదు చేయాలని ఈ మేరకు ఆదేశించింది. గ్రామాల్లో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాలన్న కొత్త పంచాయతీరాజ్ చట్టం నిబంధనల మేరకు ఈనెల నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది. దీంతో గ్రామవాసులకు వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సులభంగా అందనుంది. పెళ్లయిన మరుసటి రోజే.. కొత్త పంచాయతీ రాజ్ చట్ట నిబంధనల నేపథ్యంలో మార్చి నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానుంది. గ్రామపరిధిలో జరిగే ప్రతీ వివాహాన్ని రిజిస్టర్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులకు కట్టబెట్టారు. ఇదివరకు గ్రామ కార్యదర్శులు ఆ గ్రామంలో జరిగే వివాహాలు నమోదు చేసుకుని తెల్ల కాగితాలపై ధ్రువపత్రం జారీ చేసేవారు. దీని ఆధారంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వివాహ ధ్రువపత్రం జారీ చేసేవారు. కానీ ఇకపై గ్రామాల్లోనే వివాహ సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు చేపడుతున్నారు. ఏదైనా వివాహం జరిగిన మరుసటి రోజే సర్టిఫికెట్ జారీ చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయాల్లో ఇందుకోసం ఒక విభాగం ఏర్పాటు చేయనున్నారు. పం చాయతీ కార్యదర్శులకు సైతం శిక్షణ ఇవ్వనున్నారు. పెళ్లయిన జంట వారి ఆధార్‌కార్డు, వివాహ ఆహ్వాన పత్రిక, ఫొటోలు, ముగ్గురు సాక్షుల సంతకాలతో పంచాయతీ కార్యాలయంలో సంప్రదిస్తే పంచాయతీ కార్యదర్శి పరిశీలించి వివాహ సర్టిఫికెట్ జారీ చేస్తారు. బాల్యవివాహాలకు అడ్డుకట్ట గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలన్న నిర్ణయంతో ప్రధానంగా బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడనుంది. కల్యాణలక్ష్మి పథకం కింద లబ్ధి పొందాలంటే వివాహ నమోదు తప్పనిసరి. 18ఏళ్లు నిండని మైనర్లకు పెళ్లి చేస్తే అధికారులు వివాహ నమోదు చేయరు. దీంతో కల్యాణలక్ష్మి పథకానికి వారు అనర్హులవుతారు. ప్రభుత్వం అందించే ఆర్థికసాయానికి దూరమవుతారు. దీని వల్ల బాల్యవివాహాలకు అడ్డుకట్టు పడే అవకాశం ఉంది. 396కు 74 మందే కార్యదర్శులు జిల్లావ్యాప్తంగా 396 గ్రామపంచాయతీలు ఉండగా కేవలం 74 మంది మాత్రమే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. దీంతో వారికి ఈ బాధ్యతలు అదనం. రాష్ట్రప్రభుత్వం ఇటీవలే పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రాతపరీక్షలు నిర్వహించి ఎంపిక చేసినా.. ఇంకా భర్తీ ప్రక్రియ జరగలేదు. దీంతో ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది. కొన్ని గ్రామపంచాయతీల్లో ఒకటి నుంచి రెండు అనుబంధ గ్రామాలు సైతం ఉన్నాయి. వచ్చేది పెళ్లిళ్ల సీజన్.. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లలో పంచాయతీ కార్యదర్శుల కొరత కారణంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం లేకపోలేదు. పనిభారంతో.. జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు కొరత కారణంగా ఇప్పటికే ఒక్కొక్కరికి ఐదు పంచాయతీల చొప్పున బాధ్యతలు అప్పగించారు. ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ఇంకుడుగుంతల నిర్మాణం, మరుగుదొడ్ల నిర్మాణం, పన్నుల వసూలు, జనన, మరణాల నమోదు, ఆదాయ, వ్యయాలు, గ్రామసభలు, పంచాయతీ సమావేశాలు నిర్వహించడం, నీటిసమస్య, మురికికాల్వలు, వీధిదీపాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి బాధ్యతలతో పంచాయతీ కార్యదర్శులకు పనిభారం అవుతోంది. దీనికి తోడు వచ్చేది వేసవి కావడంతో ఆయా గ్రామాల్లో మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరికి ఐదేసి పంచాయతీల బాధ్యతలు ఉండడంతో వారికి పనిభారం తప్పేలా లేదు. ప్రస్తుతం పంచాయతీ కార్యదర్శులకు వివాహ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అప్పగించడంతో మరింత పనిభారం పడుతుందని వారు పేర్కొంటున్నారు. నమోదుకు చర్యలు తీసుకుంటాం గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు పంచాయతీ కార్యదర్శులకు బాధ్యతలు అప్పగించాలని ఆదేశించింది. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల కొరత ఉంది. ప్రభుత్వం ఇదివరకే పంచాయతీ కార్యదర్శుల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. ఎంపికైన నూతన కార్యదర్శులతో భర్తీ చేస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందికే ఇన్చార్జి బాధ్యతలు అప్పగించాం. గ్రామాల్లోనే వివాహ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం. – శ్రీనివాస్, డీపీవో, నిర్మల్ -
అభిశరవణన్‌పై నటి అతిథిమీనన్ ఫిర్యాదు
పెరంబూరు: నకిలీ పెళ్లి రిజిస్టేషన్ పత్రాలతో అసత్యాలను ప్రచారం చేస్తున్నాడని నటుడు అభిశరవణన్‌పై నటి అతిథిమీనన్ సోమవారం స్థానిక వెప్పేరిలోని పోలీస్కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. అందులో ఆమె పేర్కొంటూ తాను కేరళకు చెందిన నటినని పేర్కొంది. తన వయసు 26 అని, పట్టాదారి అనే తమిళ చిత్రంతో కోలీవుడ్‌లో పరిచయం అయినట్లు తెలిపింది. ప్రస్తుతం తను చెన్నైలోనే నివసిస్తున్నానని పేర్కొంది. పట్టాదారి చిత్రంలో మదురైకి చెందిన శరవణకుమార్ అనే వ్యక్తి అభిశరవణన్‌గా పేరు మార్చుకుని హీరోగా నటించాడని తెలిపింది. ఆ చిత్ర షూటింగ్ సమయంలో తామిద్దరం ప్రేమించుకున్నామని చెప్పింది. అలాంటి సమయంలో అభిశరవణన్ నకిలీ రిజిస్టర్ పెళ్లి పత్రాల్లో తన చేత సంతకం చేయించాడని చెప్పింది. ఆ తరువాత అభిశరవణన్ ప్రవర్తనలో మార్పు రావడంతో తాను అతని నుంచి దూరం అయ్యానని తెలిపింది. దీంతో తమను ఒకటిగా చేర్చాలని కోరుతూ అభిశరవణన్ మదురై కుటుంబ సంక్షేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడని చెప్పింది. నిజానికి తాను ఏ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లి పెళ్లి ధ్రువీకరణ పత్రాలపై సంతకాలు చేయలేదని తెలిపింది. అలాంటిది అభిశరవణన్ నకిలీ పెళ్లి ధ్రువపత్రాలను, తాను అతనితో దిగిన ఫొటోలను వాట్సాప్‌లో పోస్ట్ చేసి దుష్ప్రచారం చేస్తున్నాడని తెలిపింది. ఈ వ్యవహారంలో అతను, అతని అనుచరులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరింది. అభిశరవణన్ సామాజిక సేవ పేరుతో పలువురి వద్ద డబ్బు పొంది మోసానికి పాల్పడడం వల్లే తాను అతనిని వదిలి వచ్చేశానని అతిథిమీనన్ అందులో పేర్కొంది. ఆమె ఫిర్యాదును నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇటీవల నటుడు అభిశరవణన్‌ను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసిన సంఘటన గురించి తెలిసిందే. అందులో నటి అతిథిమీనన్ హస్తం ఉందనే ప్రచారం జరిగిందన్నది గమనార్హం. -
ఎన్నారై పెళ్లిళ్లు.. కేంద్రం కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నారై పెళ్లిళ్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎన్నారైతో పెళ్లి జరిగిన 48 గంటల్లో తప్పక రిజిస్టర్ చేయించాలనే నిబంధన తీసుకొచ్చింది. లేని పక్షంలో వారి వీసా, పాస్‌పోర్టు జారీని నిలిపేస్తామని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి మేనకా గాంధీ బుధవారం తెలిపారు. దీనికి మందు ఎన్నారై పెళ్లి రిజిస్టర్‌కు నిర్దిష్ట కాల పరిమితి లేదు. అయితే, ఎన్నారై పెళ్లిళ్ల వ్యవహారంలో వరకట్న వేధింపులు, మహిళల హత్యోదంతాలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. నిందితులపై మోపిన నేరం నిరూపించడానికి, వారిని విదేశాల నుంచి రప్పించడానికి న్యాయ పరమైన సమస్యలు అనేకం ఎదురవుతున్నాయి. 48 గంటల్లో పెళ్లి రిజిస్టర్ చేయించడం ద్వారా కేంద్రం డాటాబేస్‌లోకి ఎన్నారై వివరాలు చేరుతాయి. తద్వారా భారత్‌కి వచ్చివెళ్లే ఎన్నారై కదలికలపై దృష్టి సారించవచ్చని మేనక తెలిపారు. వారిపై నిఘా ఉంచడం ద్వారా ఏదైనా నేరానికి పాల్పడి దేశం నుంచి పారిపోకుండా ఎన్నారైలను అడ్డుకోవచ్చని ఆమె అన్నారు. వీసా, పాస్‌పోర్టును రద్దు చేసి నేర విచారణ చేపట్టొచ్చని వివరించారు. కాగా, తాజా నిర్ణయానికి ముందు ఎన్నారై పెళ్లిని 30 రోజులలోపు రిజిస్టర్ చేసేలా నిబంధన రూపొందించాలని ‘లా కమిషన్’ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు సూచించడం గమనార్హం. -
ప్రతి పెళ్లీ నమోదు కావాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరిగే ప్రతి పెళ్లిని చట్ట ప్రకారం నమోదు చేసేందుకు పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. అన్ని గ్రామాల్లో కచ్చితంగా వివాహాలను నమోదు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల పంచాయతీ అధికారులకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. వీటికి అనుగుణంగా పంచాయతీలకు డీపీవోలు సర్క్యులర్ పంపారు. వివాహాల నమోదుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ‘పంచాయతీల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలి. మహిళా, శిశు సంక్షేమ శాఖ వెబ్సైట్ నుంచి దరఖాస్తులు డౌన్లోడ్ చేసి అందుబాటులో ఉంచాలి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలి. మీ–సేవ కేంద్రాల్లోనూ దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేయాలి’అని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా.. బాల్య వివాహాలను అరికట్టడం, వివాహానికి చట్టబద్ధత కల్పించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం మ్యారేజెస్ రిజిస్ట్రేషన్ యాక్ట్‌ను తీసుకొచ్చింది. ఆ చట్టం ప్రకారం ప్రతి పెళ్లిని తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. కానీ చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా వివాహాల నమోదులో ఆశించిన పురోగతి లేదు. ఇప్పటివరకు వివాహాల రిజిస్ట్రేషన్ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనో.. తహసీల్దార్ కార్యాలయాల్లోనో నమోదయ్యేవి. తాజాగా పంచాయతీ స్థాయిలో ధ్రువీకరిస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. అయినా పెద్దగా పురోగతి లేకపోవడంతో వివాహాల రిజిస్ట్రేషన్‌తో అనేక రకాల ఉపయోగాలున్నాయని ప్రచారం చేస్తూ గ్రామాల్లో నమోదు పెంచాలని పంచాయతీరాజ్ శాఖ చర్యలు చేపట్టింది. -
కల్యాణ వైభోగమే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివాహాలు చేసుకుంటున్న జంటలు తమ పెళ్లిని చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోవడంలో ఆసక్తి చూపుతున్నాయి. ప్రతి పెళ్లికి చట్టబద్ధత ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ప్రస్తుత పరిస్థితి మారుతోంది. దాంతో ఏటా జరుగుతున్న వివాహాల్లో ఎక్కువ శాతం చట్ట ప్రకారం నమోదవుతున్నాయి. రాష్ట్రంలో ఏటా సగటున మూడు లక్షల జంటలు వివాహ బంధంతో ఒక్కటవుతున్నట్లు అంచనా. అధికారిక అంచనాల ప్రకారం గత మూడేళ్లలో 9.75 లక్షలకుపైగా పెళ్లిళ్లు జరగగా.. 3.10 లక్షల పెళ్లిళ్లు రిజిస్టర్ అయ్యాయి. ఇది దేశంలోనే టాప్ అని అధికారవర్గాలు చెబుతున్నాయి. క్రమంగా పెరుగుతున్న శ్రద్ధ బాల్య వివాహాలను అరికట్టడంతో పాటు వివాహ బంధానికి చట్టపర రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం వివాహాల నమోదు చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది అమల్లోకి వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా.. వివాహాల నమోదు పెద్దగా కనిపించలేదు. గతంలో వివాహాల రిజిస్ట్రేషన్ కేవలం సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో చేసేవారు. అనంతరం గ్రామ పంచాయతీ స్థాయిలో ధ్రువీకరణ చేస్తే సరిపోతుందని ప్రభుత్వం నిబంధనలు సడలించింది. దాంతో పరిస్థితి కొద్దిగా మెరుగుపడినా పెద్దగా పురోగతి లేదు. అయితే రాష్ట్రంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలను చేపట్టిన నేపథ్యంలో.. వివాహాల నమోదు బాగా పెరిగింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేందుకు జంటలు వివాహాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాయి. సర్కారు ‘కానుక’తో.. తెలంగాణ ఏర్పాటయ్యాక టీఆర్ఎస్ సర్కారు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమల్లోకి తెచ్చింది. క్షేత్రస్థాయిలో ఈ పథకాలకు బాగా డిమాండ్ పెరిగింది. తొలి రెండేళ్లు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే పరిమితం చేసిన ఈ పథకాలను.. అనంతరం బీసీ, ఈబీసీ వర్గాలకూ వర్తింపజేశారు. 2014–15, 2015–16, 2016–17 సంవత్సరాల్లో లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.51,116 నగదును కానుకగా అందించగా.. 2017–18 ఏడాది నుంచి రూ.75,116కు పెంచింది. దీంతో అన్ని వర్గాల నుంచి దరఖాస్తులు పెరిగాయి. ఈ రెండు పథకాల కింద అక్టోబర్ నాటికి 2.75 లక్షల దరఖాస్తులు రాగా.. 2.46 లక్షల జంటలు ‘కానుక’అందుకున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. ఎన్నారై పెళ్లిళ్లపై అవగాహన ఇటీవల ఎన్నారై వివాహాల సంఖ్య పెరుగుతోంది. విదేశాల్లో స్థిరపడిన వరుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు ఇక్కడి తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలాంటి ఎన్నారై పెళ్లిళ్లు బెడిసికొడుతున్న సందర్భాలు చాలా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నారై సంబంధాల విషయంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం, మహిళా అవగాహన కల్పిస్తున్నాయి. అలాంటి వివాహాలన్నింటినీ రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. గత మూడేళ్లలో రాష్ట్రంలో 26 వేల ఎన్నారై వివాహాలు జరిగినట్లు హైదరాబాద్‌కు చెందిన మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు ఒకరు తెలిపారు. -
వివాహ రిజిస్ట్రేషన్ల కోసం అవస్థలు..తప్పని తిప్పలు
రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది సమ్మె చేస్తుండడంతో గత నెలరోజులుగా సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో వివాహ రిజిస్ట్రేషన్లు చేయించుకోవాల్సినవారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విదేశాలకు వెళ్లేవారు, విదేశాల నుంచి పెళ్లి నిమిత్తం వచ్చినవారు ఈ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఇక్కడికొచ్చి పెళ్లి చేసుకున్నాక భార్యను తీసుకెళ్లేందుకు వీసా కోసం వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ తప్పక సమర్పించాలి. శ్రావణమాసంలో శుభముహూర్తాలు ఉండటంతో గత పక్షం రోజుల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. వీటిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయకపోవడంతో చాలామంది ఏంచేయాలో అర్థంకాక సతమతమవుతున్నారు. దీంతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల విభాగం కమిషనరేట్‌లో ఉన్నతాధికారుల్ని కలిసి సమస్యను ఏకరువు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఏ ప్రాంతంవారైనా హైదరాబాద్‌లోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ప్రధాన కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకునే వెసులుబాటు కల్పించినట్టు ఉన్నతాధికారులు తెలిపారు. వాస్తవానికి వధూవరుల్లో ఎవరోఒకరు నివాసముంటున్న ప్రాంతంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలోనే వివాహ రిజిస్ట్రేషన్లు చేయాలనే నిబంధన ఉంది. అయితే 2011లో తెలంగాణలో సకల జనుల సమ్మె సందర్భంగా 42 రోజులపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు పనిచేయలేదు. అప్పుడు ప్రవాసాంధ్రులు, ఇతరుల నుంచి వచ్చిన వినతుల మేరకు రాష్ట్రం లోని ఏప్రాంతంవారైనా సీఐజీ కార్యాలయంలో వివాహ రిజిస్ట్రేషన్ చేయిం చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ప్రస్తుతం సీమాంధ్రలో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు మూతపడినందున అత్యవసర వివాహ రిజిస్ట్రేషన్ అవసరమైనవారు హైదరాబాద్‌లోని సీఐజీ కార్యాలయానికి వచ్చి వివాహ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చని ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’కి తెలిపారు.