
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. (చదవండి: వేగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం)
సహజవనరులపరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటును అందించటమేకాక పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment