జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు | Promotion of Junior Civil Judges Andhra Pradesh | Sakshi
Sakshi News home page

జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు

Nov 20 2022 4:04 AM | Updated on Nov 20 2022 4:04 AM

Promotion of Junior Civil Judges Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురు జూనియర్‌ సివిల్‌ జడ్జిలకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారికి వివిధ చోట్ల పోస్టింగ్‌లు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది.  సత్తెనపల్లి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.కిరణ్‌కుమార్‌ను నంద్యాల రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించింది. గిద్దలూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాజేష్‌ను ఆత్మకూరు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, తాడిపత్రి జూనియర్‌ సివిల్‌ జడ్జి బి.పద్మను రాజమహేంద్రవరం రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి(ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు)గా నియమించింది.

కందూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.వాణిని బాపట్ల అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, ఏలూరు రెండో అదనపు జూనియర్‌ సివిల్‌జడ్జి ఎం.ప్రమీలారాణిని రాజోలు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, తూర్పుగోదావరి జిల్లా ఒకటో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి మధుస్వామిని నరసరావుపేట అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, నరసరావుపేట అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.శోభారాణిని నరసరావుపేట ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, కడప మూడో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి షేక్‌ పెద ఖాసింను నూజివీడు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, ఒంగోలు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎ.రాధాకృష్ణను విశాఖపట్నం ఏడో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.దుర్గావెంకటనాగసింధూరను విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించింది.

అక్కడ పనిచేస్తున్న ఎస్‌.సుజాతను విశాఖపట్నం ప్రిన్సిపల్‌ సీనియర్‌ జడ్జిగా, విజయవాడ ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సీహెచ్‌ సునందమ్మను విజయవాడ రెండో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌(జువైనల్‌ కోర్టు)గా, అక్కడ పనిచేస్తున్న డి.సత్యవతిని విజయవాడ చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌గా, విజయవాడ రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ 11వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కె.కృష్ణసత్యలతను తణుకు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.వెంకటశేషమ్మను గుంటూరు రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి(ఫ్టాస్ట్‌ట్రాక్‌)గా, గుంతకల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కేవీ రామకృష్ణయ్యను మచిలీపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా, అక్కడ పనిచేస్తున్న ఎ.పద్మను మచిలీపట్నం ప్రిన్సిపల్‌ సీనియర్‌ జడ్జిగా నియమించారు.

పిఠాపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి ఎస్‌.వెంకటేశ్వరరెడ్డిని విజయవాడ రెండో అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, అమలాపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి వై.శ్రీలక్ష్మిని గాజువాక అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌గా, అక్కడ పనిచేస్తున్న ఎన్‌.శ్రీవిద్యను గాజువాక ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. శ్రీకాళహస్తి ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి రాఘవేంద్రను పుత్తూరు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, కడప స్పెషల్‌ మొబైల్‌ కోర్టు ఫస్ట్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎం.ప్రదీప్‌కుమార్‌ను కడప అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న ఎస్‌.హేమలతను కడప ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు.

ఏలూరు ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పి.దివాకర్‌ను కర్నూలు అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న టి.కేశవను కర్నూలు ప్రిన్సిపల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జిగా నియమించారు. వీరంతా ఈ నెల 30వ తేదీలోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు రిజిస్ట్రార్‌(విజిలెన్స్‌) సునీత ఉత్తర్వులు జారీ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement