Junior Civil Judges
-
జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పలువురు జూనియర్ సివిల్ జడ్జిలకు పదోన్నతులు కల్పించడంతో పాటు వారికి వివిధ చోట్ల పోస్టింగ్‌లు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. సత్తెనపల్లి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.కిరణ్‌కుమార్‌ను నంద్యాల రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించింది. గిద్దలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాజేష్‌ను ఆత్మకూరు సీనియర్ సివిల్ జడ్జిగా, తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జి బి.పద్మను రాజమహేంద్రవరం రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఫాస్ట్ ట్రాక్ కోర్టు)గా నియమించింది. కందూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి జి.వాణిని బాపట్ల అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, ఏలూరు రెండో అదనపు జూనియర్ సివిల్‌జడ్జి ఎం.ప్రమీలారాణిని రాజోలు సీనియర్ సివిల్ జడ్జిగా, తూర్పుగోదావరి జిల్లా ఒకటో అదనపు జూనియర్ సివిల్ జడ్జి మధుస్వామిని నరసరావుపేట అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, నరసరావుపేట అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎ.శోభారాణిని నరసరావుపేట ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా, కడప మూడో అదనపు జూనియర్ సివిల్ జడ్జి షేక్ పెద ఖాసింను నూజివీడు సీనియర్ సివిల్ జడ్జిగా, ఒంగోలు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎ.రాధాకృష్ణను విశాఖపట్నం ఏడో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, తిరుపతి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.దుర్గావెంకటనాగసింధూరను విశాఖపట్నం మొదటి అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా నియమించింది. అక్కడ పనిచేస్తున్న ఎస్.సుజాతను విశాఖపట్నం ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా, విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సీహెచ్ సునందమ్మను విజయవాడ రెండో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్(జువైనల్ కోర్టు)గా, అక్కడ పనిచేస్తున్న డి.సత్యవతిని విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా, విజయవాడ రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి కమ్ 11వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.కృష్ణసత్యలతను తణుకు సీనియర్ సివిల్ జడ్జిగా, గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.వెంకటశేషమ్మను గుంటూరు రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జి(ఫ్టాస్ట్ట్రాక్)గా, గుంతకల్ జూనియర్ సివిల్ జడ్జి కేవీ రామకృష్ణయ్యను మచిలీపట్నం జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శిగా, అక్కడ పనిచేస్తున్న ఎ.పద్మను మచిలీపట్నం ప్రిన్సిపల్ సీనియర్ జడ్జిగా నియమించారు. పిఠాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.వెంకటేశ్వరరెడ్డిని విజయవాడ రెండో అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి వై.శ్రీలక్ష్మిని గాజువాక అదనపు సీనియర్ సివిల్ జడ్జి కమ్ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌గా, అక్కడ పనిచేస్తున్న ఎన్.శ్రీవిద్యను గాజువాక ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. శ్రీకాళహస్తి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి రాఘవేంద్రను పుత్తూరు సీనియర్ సివిల్ జడ్జిగా, కడప స్పెషల్ మొబైల్ కోర్టు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఎం.ప్రదీప్‌కుమార్‌ను కడప అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న ఎస్.హేమలతను కడప ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి పి.దివాకర్‌ను కర్నూలు అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా, అక్కడ పనిచేస్తున్న టి.కేశవను కర్నూలు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జిగా నియమించారు. వీరంతా ఈ నెల 30వ తేదీలోపు కొత్త పోస్టుల్లో చేరాలని హైకోర్టు రిజిస్ట్రార్(విజిలెన్స్) సునీత ఉత్తర్వులు జారీ చేశారు. -
జూనియర్ సివిల్‌జడ్జిల బదిలీలు
అనంతపురం లీగల్: జిల్లాలోని పలువురు జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ సోమవారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న రామచంద్రుడు పదోన్నతి పొంది బదిలీకాగా, ఆ స్థానం లో ఎవరినీ నియమించలేదు. అలాగే అబ్కారీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేటు ఎం.బుజ్జప్పను తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు జేసీజే తౌషీద్ హుస్సేన్‌ను నియమించారు. ఇక ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న టి. లీలావతిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఉరవకొండ జేసీజే ఎ.సాయికుమారిని ధర్మవరం జేసీజేగా బదిలీ చేశారు. గుత్తి జేసిజేగా ఉన్న డి.వెంకటేశ్వర్లు నాయక్‌ను ప్రకాశం జిల్లా గిద్దలూరుకు బదిలీ చేశారు. కదిరి అదనపు జేసీజేగా ఉన్న వి. ఆదినారాయణను చిత్తూరు జిల్లా సత్యవేడు జేసీజేగా బదిలీ చేశారు. అలాగే కర్నూలు జిల్లా డోన్ జేసీజేగా ఉన్న జె కె.సూరికృష్ణను కదిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం కదిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న జి.వాణి ఇక నుంచి కదిరి అదనపు జేసీజేగా వ్యవహరించనున్నారు. -
జేసీజే నియామకాలకు లైన్ క్లియర్
హైదరాబాద్ : జూనియర్ సివిల్ జడ్జిల (జేసీజే) నియమకాలకు లైన్ క్లియర్ అయింది. 2014 నోటిఫికేషన్ ప్రకారం జరిగిన జేసీజే రాత పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామకపు పత్రాలు అందచేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే ఆదేశాలు 2015 నోటిఫికేషన్‌కు సైతం వర్తిస్తుందని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజన జరిగేంత వరకు జూనియర్ సివిల్ జడ్జీల పోస్టులను భర్తీ చేయవద్దని కోరుతూ సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. తరువాత ఇదే అంశంపై మరి కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘ విచారణ చేపట్టి తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం శుక్రవారం తన తీర్పును వెలువరించింది. సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను, ఇతర వ్యాజ్యాలను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. 2014, 2015 సంవత్సరాల్లో జేసీజే పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్ల ఆధారంగా నిర్వహించిన రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తీర్పు కాపీ అందుబాటులోకి రాకపోవడంతో పిటిషన్ల కొట్టివేతకు కారణాలు తెలియరాలేదు. -
జేసీజే రాతపరీక్ష తాత్కాలికంగా నిలుపుదల
* హైకోర్టు న్యాయమూర్తుల కమిటీలో భిన్నాభిప్రాయాలు * సుప్రీంకోర్టు నుంచి స్పష్టత తీసుకోవాలని నిర్ణయం.. అప్పటివరకూ పరీక్ష నిలుపుదల సాక్షి, హైదరాబాద్: ఈ నెల 27న నిర్వహించ తలపెట్టిన జూనియర్ సివిల్ జడ్జి(జేసీజే) పోస్టుల రాత పరీక్షను హైకోర్టు తాత్కాలికంగా నిలుపుదల చేసింది. ఖాళీగా ఉన్న 97 జూనియర్ సివిల్ జడ్జీల పోస్టుల భర్తీకోసం హైకోర్టు ఫిబ్రవరి 1న నోటిఫికేషన్ జారీ చేసింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అయితే జూన్ 2వ తేదీ నుంచి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడుతున్న పరిస్థితుల్లో జేసీజే పరీక్ష నిర్వహించడం సరికాదని, దీనిని వాయిదా వేయాలని కోరుతూ న్యాయవాదుల నుంచి డిమాండ్లు వచ్చాయి. మరోవైపు ఈ పరీక్షను వాయిదా వేయాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. ఈ నేపథ్యంలో కిందిస్థాయి న్యాయవ్యవస్థ విభజనపై ఏర్పాటైన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ బుధవారం సమావేశమైంది. జేసీజే పరీక్ష వాయిదా వేయాలా? వద్దా? అనే అంశంపైనే దాదాపు 20 నిమిషాలపాటు చర్చించింది. పరీక్ష వాయిదాపై కమిటీలోని న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టు నుంచి స్పష్టత లేదా ఉత్తర్వులు పొందాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు నుంచి స్పందన వచ్చేంత వరకు రాత పరీక్షను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు రిజిష్ట్రార్(రిక్రూట్మెంట్) గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. -
సివిల్ జడ్జిలే మూల స్తంభాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా హైదరాబాద్, న్యూస్‌లైన్: క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ సివిల్ జడ్జిలే న్యా య వ్యవస్థకు మూల స్తంభాల్లాంటివారని, వారి పనితీరుతోనే న్యాయవ్యవస్థ ప్ర తిష్ట ఇనుమడిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఉద్ఘాటించారు. తమిళనాడు న్యాయ అకాడమీలో శిక్షణ పొందిన జూని యర్ సివిల్ జడ్జిల విజ్ఞాన అవగాహన సదస్సు ఏపీ న్యాయ అకాడమీలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్య అతి థిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జిలు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేయాలన్నారు. ఏపీ న్యాయవ్యవస్థ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సుభాష్‌రెడ్డి, డెరైక్టర్ వీఎస్ అవధాని, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు ప్రసంగించారు. తమిళనాడుకు చెందిన 30 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జిలు సహా రాష్ట్రానికి చెందిన పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.