సివిల్ జడ్జిలే మూల స్తంభాలు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా
హైదరాబాద్, న్యూస్‌లైన్: క్షేత్రస్థాయిలో పనిచేసే జూనియర్ సివిల్ జడ్జిలే న్యా య వ్యవస్థకు మూల స్తంభాల్లాంటివారని, వారి పనితీరుతోనే న్యాయవ్యవస్థ ప్ర తిష్ట ఇనుమడిస్తుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా ఉద్ఘాటించారు. తమిళనాడు న్యాయ అకాడమీలో శిక్షణ పొందిన జూని యర్ సివిల్ జడ్జిల విజ్ఞాన అవగాహన సదస్సు ఏపీ న్యాయ అకాడమీలో శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా ముఖ్య అతి థిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జూనియర్ సివిల్ జడ్జిలు అంకితభావంతో పనిచేస్తూ వృత్తి గౌరవాన్ని ఇనుమడింపజేయాలన్నారు. ఏపీ న్యాయవ్యవస్థ అకాడమీ అధ్యక్షుడు జస్టిస్ సుభాష్‌రెడ్డి, డెరైక్టర్ వీఎస్ అవధాని, న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, జస్టిస్ నౌషద్ అలీ తదితరులు ప్రసంగించారు. తమిళనాడుకు చెందిన 30 మంది ట్రైనీ జూనియర్ సివిల్ జడ్జిలు సహా రాష్ట్రానికి చెందిన పలువురు జూనియర్ సివిల్ జడ్జిలు పాల్గొన్నారు.