జూనియర్ సివిల్‌జడ్జిల బదిలీలు
Published Tue, May 2 2017 2:05 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
అనంతపురం లీగల్:
జిల్లాలోని పలువురు జూనియర్ సివిల్ జడ్జీలను బదిలీ చేస్తూ సోమవారం హైకోర్టు నుంచి ఉత్తర్వులు అందాయి. అనంతపురం ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న రామచంద్రుడు పదోన్నతి పొంది బదిలీకాగా, ఆ స్థానం లో ఎవరినీ నియమించలేదు. అలాగే అబ్కారీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం మేజిస్ట్రేటు ఎం.బుజ్జప్పను తాడిపత్రి జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు.
ఆయన స్థానంలో ప్రకాశం జిల్లా గిద్దలూరు జేసీజే తౌషీద్ హుస్సేన్‌ను నియమించారు. ఇక ధర్మవరం జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న టి. లీలావతిని చిత్తూరుకు బదిలీ చేశారు. ఉరవకొండ జేసీజే ఎ.సాయికుమారిని ధర్మవరం జేసీజేగా బదిలీ చేశారు. గుత్తి జేసిజేగా ఉన్న డి.వెంకటేశ్వర్లు నాయక్‌ను ప్రకాశం జిల్లా గిద్దలూరుకు బదిలీ చేశారు. కదిరి అదనపు జేసీజేగా ఉన్న వి. ఆదినారాయణను చిత్తూరు జిల్లా సత్యవేడు జేసీజేగా బదిలీ చేశారు. అలాగే కర్నూలు జిల్లా డోన్ జేసీజేగా ఉన్న జె కె.సూరికృష్ణను కదిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా బదిలీ చేశారు. దీంతో ప్రస్తుతం కదిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జిగా ఉన్న జి.వాణి ఇక నుంచి కదిరి అదనపు జేసీజేగా వ్యవహరించనున్నారు.
Advertisement
Advertisement