సాక్షి, అమరావతి: ప్రభుత్వం చేసే మంచిని కూడా చెడుగా చిత్రీకరిస్తూ అసత్య ప్రచారం చేస్తున్న యెల్లో మీడియాకు, ప్రతి పక్షాలకు ఇక నుంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాల్సిందేనని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానంగా అదే పనిగా ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిని ఎట్టి పరిస్థితిల్లో కూడా ఉపేక్షించే మాటే ఉండకూడదని మంత్రులకు దిశా నిర్దేశం చేశారు సీఎం జగన్.
‘టీడీపీ తప్పుడు ఆరోపణలు తిప్పికొట్టండి. ప్రతి పక్షాల అబద్ధాలపై స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇవ్వండి. మంత్రులు అందరూ ప్రతి అంశం పై స్పందించాలి. టీడీపీ, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి ప్రతి రోజూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. కుటుంబ సభ్యులపై అనవసర విమర్శలు చేస్తున్నారు. ఇక మీదట వాళ్ళ ఆరోపణలను ఉపేక్షించడానికి వీలు లేదు’ అని భేటీకి హాజరైన మంత్రులకు సూచించారు సీఎం జగన్. కాగా, ఈరోజు(బుధవారం) సచివాలయం మొదటి బ్లాక్‌లోని మంత్రివర్గ సమావేశ మందిరంలో ఏపీ కేబినెట్ భేటీ జరగ్గా, 57 అంశాలకు ఆమోద ముద్ర పడింది.
Comments
Please login to add a commentAdd a comment