సాక్షి, విశాఖపట్నం: పీఎం పాలెంలో రియల్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్లాట్ అమ్మకం విషయంలో రియల్టర్ మధుసూదన్ రావుకు రౌడీ షీటర్ హేమంత్ కుమార్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మధుసూదన్ రావును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. ప్లాట్ అమ్మకాల్లో వివాదం కారణంగా రౌడీ షీటర్ 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఇది కుదరకపోవడంతో రియల్టర్ మధుసూదన్‌ను రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేశారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసు కమిషనర్ శ్రీకాంత్‌ను ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. పద్మనాభం అనే వ్యక్తి వద్ద మధుసూదన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రియల్టర్ మధుసూదన్ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు.
కాగా, రౌడీ షీటర్ హేమంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హేమంత్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక, మధుసూదన్ కిడ్నాప్‌కు సహకరించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment