kidnap issue
-
పీఎం పాలెం: రియల్టర్ కిడ్నాప్ కలకలం.. 12 లక్షలు డిమాండ్!
సాక్షి, విశాఖపట్నం: పీఎం పాలెంలో రియల్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. ప్లాట్ అమ్మకం విషయంలో రియల్టర్ మధుసూదన్ రావుకు రౌడీ షీటర్ హేమంత్ కుమార్‌కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మధుసూదన్ రావును కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ప్లాట్ అమ్మకాల్లో వివాదం కారణంగా రౌడీ షీటర్ 12 లక్షలు డిమాండ్ చేశాడు. ఇది కుదరకపోవడంతో రియల్టర్ మధుసూదన్‌ను రౌడీ షీటర్ హేమంత్ కిడ్నాప్ చేశారు. దీంతో, బాధితుడి కుటుంబ సభ్యులు పోలీసు కమిషనర్ శ్రీకాంత్‌ను ఆశ్రయించారు. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు కిడ్నాప్ కేసుపై దర్యాప్తు చేపట్టారు. పద్మనాభం అనే వ్యక్తి వద్ద మధుసూదన్ ఉన్నట్టు గుర్తించారు. దీంతో, రియల్టర్ మధుసూదన్ సురక్షితంగా ఉన్నట్టు పేర్కొన్నారు. కాగా, రౌడీ షీటర్ హేమంత్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. హేమంత్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఇక, మధుసూదన్ కిడ్నాప్‌కు సహకరించిన ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెప్పారు. -
వెంటాడి..వేటాడి...కిడ్నాపర్లను పట్టిచ్చి.
-
వెంటాడి ..వేటాడి... కిడ్నాపర్లను పట్టిచ్చి..
ఓ కంపెనీ యజమాని భార్యను కిడ్నాప్ చేసే యత్నం 100 నంబరుకు ఓ యువకుడిచ్చిన సమాచారంతో పోలీసులు అప్రమత్తం డ్రైవరు పరారీ, ఇద్దరిని పట్టుకున్న పోలీసులు పిఠాపురం, కొత్తపల్లి: ఒక కారు అనుకోకుండా అతి వేగంగా దూసుకుపోతోంది. అంతలోనే హఠాత్తుగా ఆగడం ... వేగంగా ఇద్దరు యువకులు ఆ కారులో ఎక్కడం ... మళ్లీ ఆ కారు దూసుకుపోవడం ... ఇదంతా చక,చకా జరిగిపోయాయి...ఈ తతంగమంతా అటుగా బైక్‌పై వెళుతూ చూసిన ఓ యువకుడికి ఏదో జరగరానిది జరుగుతుందన్న అనుమానం కలిగింంది. ‘అదంతా మనకెందుకులే ’ అని అనుకోకుండా ఏం జరుగుతుందో చూద్దామని ఆ కారును వెంబడించాడు. అతను ఊహించినట్లే ఆ కారులో ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్టు గుర్తించి ఇదేదో కిడ్నాప్ వ్యవహారంగా భావించాడు. ఓ వైపు కారును వెంబడిసూ్తనే తన సెల్ఫో¯ŒS ద్వారా 100 నంబరుకు ఫో¯ŒS చేసి పోలీసులను అప్రమత్తం చేసి నిందితులను పట్టించి ‘శభాష్’ అనిపించుకున్నాడు. కాకినాడ – తుని బీచ్ రోడ్డులో సోమవారం సాయంత్రం ఓ గంటపాటు సినీఫక్కీలో జరిగిన కిడ్నాప్ సంఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. పోలీసులు ... స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కాకినాడకు చెందిన యాక్ట్ షిప్పింగ్ ఫార్వర్డు కంపెనీ యజమాని కాలే‡ వీర వెంకట సత్య సాయి భార్య ధనలక్ష్మి కంపెనీ సీఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రతి రోజు తన సొంత కారులో కాకినాడ పోర్టు సమీపంలో ఉన్న తన కంపెనీ కార్యాలయానికి వెళ్లి వస్తుంటారు. యజమానిని ఆఫీసుకు, పిల్లలను స్కూలుకు తీసుకువెళ్లే ఆమె కారు డ్రైవరు పిల్లలకు వేసవి సెలవులివ్వడంతో సెలవు పెట్టాడు. తాత్కాలికంగా వేరే డ్రైవరును పెట్టుకున్నారు. సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో తన ఇంటి నుంచి కారులో ఆఫీసుకు ధనలక్ష్మి బయలుదేరారు. ప్రతి రోజు కారు కాకినాడ కల్పన సెంటర్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి , దుమ్ములపేట మీదుగా పోర్టు సమీపంలో ఉన్న కంపెనీ కార్యాలయానికి వెళుతుంటారు. అప్పటికే కిడ్నాప్ చేసేందుకు పన్నాగం పన్నిన డ్రైవరు దయ వైఎస్సార్ బ్రిడ్జి మీదుగా తీసుకువెళ్లాడు. కారు వేరే మార్గంలో వెళుతుండడంతో అనుమానం వచ్చి ‘అలా వెళ్లాల్సింది ... ఇలా వెళుతున్నావేమిటని’ ధనలక్ష్మి అడుగుతుండగానే ముఖాలకు ముసుగులు వేసుకున్న ఇద్దరు వ్యక్తులు అదే కారులోకి చెరో వైపు నుంచి హఠాత్తుగా ఎక్కి పీకపై కత్తి పెట్టి బెదిరించి ఆమెను కదలకుండా పట్టుకున్నారు. కారును స్పీడుగా వాకలపూడి మీదుగా కాకినాడ బీచ్ రోడ్డు వైపు పోనిచ్చాడు. అక్కడ నుంచి తుని వైపు వెళ్లి విశాఖపట్నం తీసుకువెళ్లి అక్కడ ఓ రహస్య ప్రదేశంలో ఆమెను దాచి రూ.50 లక్షలు డిమాండ్ చేయాలని కిడ్నాపర్లు వ్యూహం పన్నారు. కిడ్నాపర్లను పట్టించిన యువకుడు అయితే కల్పన సెంటర్లో నుంచి కారు అతి వేగంగా వెళుతుండడం ... ఇద్దరు వ్యక్తులు కారులో ఎక్కడం ... అటుగా తన బైక్‌పై వెళుతూ ఇదంతా గమనించిన ఓ యువకుడు ఇదేదో కిడ్నాప్లా ఉందన్న అనుమానంతో వెంటనే ఆ కారును వెంబడించాడు. కారు వాకలపూడి దాటగానే కారులోంచి ఓ మహిళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ‘రక్షించమని’ వేసిన కేకలు వినిపించాయి. వెంటనే తన సెల్ నుంచి 100 నెంబరుకు ఫో¯ŒS చేసి విషయాన్ని పోలీసులకు కారు నంబరుతో సహా సమాచారం అందించగా కాకినాడ త్రీటౌ¯ŒS పోలీసులు వెంటనే కొత్తపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఉప్పాడ బీచ్‌రోడ్డు సెంటర్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరిస్తున్న ఏఎస్సై లోవరాజుకు సమాచారం రావడంతో కాకినాడ నుంచి బీచ్ రోడ్డు మీదుగా వస్తున్న కారును ఉప్పాడలో అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఆ కారు ఆపకుండా వేగంగా ముందుకు దూసుకుపోయింది. వెంబడించిన పోలీసులు కొత్తపల్లి మండలం పొన్నాడ శివారు కోనపాపపేట వాసులకు సమాచారం ఇవ్వడంతో ఓ లారీని రోడ్డుకు అడ్డంగా పెట్టి కారును అడ్డుకున్నారు. ‘మమ్మల్ని వదలక పోతే మహిళను చంపేస్తా’మని కారులో ఉన్న వ్యక్తులు ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించగా స్థానికులు చాకచక్యంగా కిడ్నాపర్లను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంతలో కిడ్నాప్ సూత్రధారి డ్రైవరు దయ తప్పించుకొని పారిపోగా మిగిలిన ఇద్దరిని పట్టుకుని దేహశుద్ధి చేసి కిడ్నాప్‌కు గురైన ధనలక్షి్మని రక్షించారు. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని స్టేష¯ŒSకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఏఎస్సీ దామోదర్ రాత్రి పదిగంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఘటన వివరాలపై ఆరా తీసారు. పేరు బయటపెట్ట వద్దన్న యువకుడు... ఇంత సాహసం చేసిన ఆ యువకుడు తన పేరు, ఊరును బయటపెట్ట వద్దని మానవత్వంతో సహాయం చేశానని ‘సాక్షి’తో చెప్పాడు.