
సాక్షి, హైదరాబాద్: టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి కారణంగా ఇటీవల 11 మందికి అమాయక ప్రజలు మృతిచెందారు. ఈ ఘటనలపై ఇప్పటికే పలువురు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా చంద్రబాబుపై సంచలన కామెంట్స్ చేశారు.
కాగా, వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ.. ‘ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం. పర్సనల్ ఇగో, పర్సనల్ గెయిన్ తప్ప ప్రజలంటే లెక్కలేదు. ఎంత మంది చనిపోతే అంత పాపులారిటీగా చంద్రబాబు ఫీల్ అవుతారు. చంద్రబాబు.. నీకు పబ్లిసిటీ పిచ్చి తప్ప.. ప్రజల ప్రాణాలు లెక్కలేదా?. హిట్లర్, ముస్సోలినీ తర్వాత నిన్నే చూస్తున్నాను. ప్రజలను కుక్కలుగా భావించి కానుకులు ఇచ్చారు. ఫొటో పిచ్చి కోసమే చంద్రబాబు కానుకులు ఇస్తున్నారు’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment