గుంటూరు జిల్లా నూతక్కికి మోహన్‌ భగత్‌ | RSS Chief Mohan Bhagwat Reached Guntur District | Sakshi
Sakshi News home page

గుంటూరు జిల్లా నూతక్కికి ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగత్‌

Published Sat, Oct 10 2020 7:40 AM | Last Updated on Sat, Oct 10 2020 7:40 AM

RSS Chief Mohan Bhagwat Reached Guntur District - Sakshi

ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయటకు వస్తున్న భగవత్‌  

సాక్షి, గుంటూరు: ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ శుక్రవారం రాత్రి గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలోని విజ్ఞాన విహార్‌ పాఠశాలలో శనివారం నుంచి మూడు రోజులు జరగనున్న ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర పదాధికారుల సమావేశాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆయన మూడురోజులూ ఈ సమావేశాల్లో పాల్గొంటారు. మంగళగిరి రూరల్‌ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు హైదరాబాద్‌ నుంచి విమానంలో వచ్చిన మోహన్‌ భగవత్‌కు గన్నవరం విమానాశ్రయంలో ఆర్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు భరత్, వాసు, పలువురు కార్యకర్తలు స్వాగతం పలికారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement