సాక్షి, తాడేపల్లి: ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ఓ వర్గం మీడియా కుట్ర పన్నుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ఆయన బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..పెన్షన్ల విషయంలో టీడీపీ అపోహలు సృష్టిస్తోందని దుయ్యబపట్టారు. పెన్షన్లు తగ్గిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు హయాంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలిసేది కాదని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. పూర్తిగా పరిశీలించాకే అనర్హులను తొలగిస్తున్నామని పేరొన్నారు.
చదవండి: ‘బాబుకు హఠాత్తుగా ఉత్తరాంధ్ర ఎందుకు గుర్తొచ్చిందో అర్థం కావడం లేదు’
చంద్రబాబు ఓడిపోయినప్పటి నుంచి ఓ వర్గం మీడియాకు బాధ ఎక్కువైపోయిందన్నారు. టీడీపీ హయాంలో పెన్షన్లు 40-50 లక్షల మందికి మించలేదని తెలిపారు. ఎన్నికలు దగ్గరకొచ్చే సమయంలో హడావుడిగా సంఖ్యను పెంచారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో 61 లక్షల మందికి పైగా అందజేస్తున్నామని తెలిపారు. అర్హులైన వృద్ధులకు సంబంధించి పూర్తి లెక్కలు తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. ఎన్నికలు వస్తే బాబుకు వృద్ధులు గుర్తుకోచ్చేవారని సజ్జల మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment