
సాక్షి, రాజమండ్రి: బీజేపీ పటిష్టతకు కృషి చేస్తానని సోము వీర్రాజు అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. బాధ్యతలు అనేవి పార్టీ నిర్ణయించే అంశాలని, అందరి సమన్వయంతో పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిస్తానని తెలిపారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతామని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు ప్రవర్తన మూలంగానే టీడీపీ ఓడిపోయింది. గత టీడీపీ ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరతాం. పోలవరానికి తప్పకుండా నిధులు తెచ్చేందుకు కృషి చేస్తాం. రాష్ట్రాభివృద్ధిలో బీజేపీ పాత్ర తప్పకుండా ఉంటుందని’’ సోము వీర్రాజు తెలిపారు. (బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు)
Comments
Please login to add a commentAdd a comment