![BJP MLC Somu Verraju Comments About Polavaram Project - Sakshi](/styles/webp/s3/article_images/2020/07/8/BJP-MLC-Somu-Verraju.jpg.webp?itok=asZ0tBQy)
సాక్షి, తూర్పుగోదావరి : పేదల ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు చెప్పేవి అన్ని అబద్దాలేనని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ' టీడీపీ హయాంలో కట్టిన ఇళ్ల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. కాగా పూర్తి చేసిన ఇళ్లు ఎందుకు పంపిణీ చేయరని టీడీపీ నేతలు ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉంది. టీడీపీ నేతలు మోసపూరిత చర్యలకు పాల్పడకుండా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చూసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందాల్సి ఉంది. టీడీపీ హయాంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేయాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలోని అవినీతి టీడీపీ హయాంలోనే జరిగింది' అంటూ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment