Student Unions Protest Against Chandrababu In Kurnool - Sakshi
Sakshi News home page

రాయలసీమ ద్రోహి గోబ్యాక్‌!.. అడుగడుగునా చంద్రబాబుకు నిరసన సెగలు

Published Fri, Nov 18 2022 3:12 PM | Last Updated on Fri, Nov 18 2022 3:33 PM

Student Unions Protest Against Chandrababu In Kurnool - Sakshi

సాక్షి, కర్నూలు: కర్నూలులో అడుగడుగునా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు నిరసన సెగ తగులుతోంది. చంద్రబాబు కాన్వాయ్‌ను విద్యార్థి సంఘాలు అడ్డుకున్నాయి. రాయలసీమ ద్రోహి గ్యోబాక్‌ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ ముందు విద్యార్థులు బైఠాయించారు.

చంద్రబాబుకు వ్యతిరేకంగా కర్నూలు జేఏసీ నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు తీవ్ర నిరసనలు వ్యక్తం చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా నల్లజెండాలు, బ్లాక్‌  బెలూన్లతో ప్రదర్శన నిర్వహించారు. కర్నూలు న్యాయ రాజధానిపై వైఖరి చెప్పాలంటూ నిలదీశారు.

మరో వైపు, చంద్రబాబుకు మరోసారి జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. వికేంద్రీకరణ అంశంతో పాటు కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంశానికి సంబంధించి చంద్రబాబు వైఖరి ఏమిటో తెలపాలని న్యాయవాదులు శుక్రవారం ధర్మా చేపట్టారు. ఈ క్రమంలోనే కర్నూలులో చంద్రబాబు బస చేసే హోటల్‌ ముందు న్యాయవాదులు ధర్నాకు దిగారు. చంద్రబాబు డౌన్‌ డౌన్‌ అంటూ నిరసన చేపట్టారు.


చదవండి: చంద్రబాబుకు చేదు అనుభవం.. గో బ్యాక్‌ అంటూ నినాదాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement