వైఎస్సార్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: సాయి ఎడ్యుకేషన్ సొసైటి ఆస్తులు అడ్డదారిలో అమ్ముకోవడంతోనే టీడీపీ నాయకుడు హరి ప్రసాద్‌పై ఫిర్యాదు చేశానని శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరిప్రసాద్‌ను నమ్మి సొసైటీలో సభ్యుడిని చేస్తే నమ్మక ద్రోహం చేశారు. సొసైటి కోసం నేను 100 కోట్లు ఖర్చు చేశాను. 2003లోనే హరి ప్రసాద్ పై రాజంపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అప్పటినుండి నాకు న్యాయం జరగలేదు. హరి ప్రసాద్ తన పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌తో ఇన్ని సంవత్సరాలు కేసును తప్పుదోవ పట్టించాడు. (చీటింగ్ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్ అరెస్ట్)
సొసైటీలో జరిగిన అక్రమాలపై కొన్ని నెలల క్రితం జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపై విచారించేందుకు పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. మా సొసైటీకి కేవలము హరి ప్రసాద్ తాత్కాలిక సభ్యుడు మాత్రమే. సొసైటీ భూములను అమ్మడానికి హరిప్రసాద్‌కు ఎటువంటి హక్కు లేదు. ఫిర్యాదులో భాగంగానే అతనిపై కేసు నమోదు చేస్తే నాపై బెదిరింపు ధోరణితో మాట్లాడడంతో పాటు తిరిగి నాపై కేసులు పెడతా అంటున్నాడు. ఒకప్పుడు ఏమీ లేని వ్యక్తి ఇప్పుడు100 కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు...?. భూ కబ్జాలు, నాటుసారా ఇలా అనేక అడ్డదార్లలో అక్రమకలకు పాల్పడ్డాడు అని శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment