
టీడీపీ వర్గీయులు రోడ్డుపై తవ్విన గొయ్యి
కురుపాం (విజయనగరం): ఓటమి జీర్ణించుకోలేని టీడీపీ వర్గీయులు కవ్వింపులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. కురుపాం మండలం ఏజెన్సీ ప్రాంతం తిత్తిరి పంచాయతీకి 13న జరిగిన ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థిపై వైఎస్సార్ సీపీ బలపరిచిన అభ్యర్థిని గౌరి విజయం సాధించారు. బల్లేరుగూడ, దొంబిడి, గాలిమానుగూడ, కీడవాయి, గేదెలగూడ, ఎగువ కీడవాయి, దిగువ కీడవాయి, ఎగువ ఆవిరి తదితర గ్రామాల వారు ఓట్లు వేయక పోవడం వల్లే ఓటమి చెందామన్న ఆగ్రహంతో టీడీపీ వర్గీయులు శనివారం రాత్రి ఆయా గ్రామాలకు చెందిన గిరిజనులు రాకపోకలు చేయకుండా రోడ్డుకు అడ్డంగా పెద్ద బండరాళ్లు వేసి గోతులు తవ్వారు. పోలీసులు వచ్చి స్థానికుల సాయంతో రాళ్లను తీయించి, గోతులను పూడ్చివేయించారు.
Comments
Please login to add a commentAdd a comment