నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాల బీభత్సం | Tdp Goons Attack Differently Abled Person In Nellore District | Sakshi
Sakshi News home page

నెల్లూరు జిల్లాలో టీడీపీ గూండాల బీభత్సం

Apr 10 2026 11:32 AM | Updated on Apr 10 2026 12:30 PM

Tdp Goons Attack Differently Abled Person In Nellore District

సాక్షి, నెల్లూరు జిల్లా: పాతకక్షలను మనస్సులో పెట్టుకొని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ దివ్యాంగ కార్యకర్తపై దాడి చేసిన ఘటన జలదంకి మండలం తిమ్మసముద్రంలో గురువారం చోటుచేసుకుంది. బాధితుడు వెంకటేశ్వర్లు కథనం మేరకు.. గ్రామానికి చెందిన వ్యవసాయ భూమి విషయమై కోర్టులో వివాదం జరగడంతో బాధితుడికి స్టేటస్‌ కో ఇచ్చారు. ఈ విషయమై టీడీపీకి చెందిన పలువురు గతంలో దాడి చేశారు.

అప్పట్లో ఇరువర్గాలు కేసులు పెట్టుకున్నారు. ఈ క్రమంలో తన నిమ్మ తోటలో వ్యవసాయ పనులు చేసుకుంటుండగా, అదే గ్రామానికి చెందిన కంచర్ల వినోద్, కంచర్ల వేణుగోపాల్, మేకల శ్రీనాథ్, కాసు మహేష్‌, మరికొందరు మారణాయుధాలతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో పక్క పొలాల వారు వారి బంధువులు, 108కు సమాచారమివ్వడంతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. జలదంకి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా పార్టీ రైతు సంఘ జిల్లా నేత రావి ప్రసాద్‌నాయుడు, జలదంకి మండల కన్వీనర్‌ ఇస్కా మదన్‌మోహన్‌రెడ్డి పరామర్శించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement