
విశాఖపట్నం: రావికమతం మండలంలో టీడీపీ వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్త పరవాడ వరహామూర్తిపై టీడీపీ వర్గీయులు దాడి చేశారు. కంట్లో కారం చల్లి కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తను టీడీపీ వర్గీయులు చితకబాదారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. కార్యకర్తను స్ధానిక ఆస్పత్రికి తరలించారు.