ఎవ్వరికీ అధికారం శాశ్వతం కాదు
మా భూములపై జరిగిన దౌర్జన్యమే నిదర్శనం
హైకోర్టును ఆశ్రయిస్తా: ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారు. అధికారం శాశ్వతం కాదు. రెవెన్యూ యంత్రాంగం 200 మంది పోలీసులతో నా కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేసింది. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అధికారులు అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తా. రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారు. – వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
కాకినాడ: రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. అధికారం శాశ్వతం కాదని, రాజకీయ కక్షలతో ఇబ్బందులు పెట్టాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధిచెబుతారన్నారు. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లిపాలెంలో తన కుటుంబానికి చెందిన 11 ఎకరాల భూమి విషయంలో అధికారుల అత్యుత్సాహమే ఇందుకు నిదర్శనమన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రైవేటు వ్యక్తుల భూతగాదాలు, రాజకీయ నాయకుల మధ్య జరిగే వివాదాల తరహాలో ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం వ్యవహరించి 200 మంది పోలీసులతో తన కుటుంబ సభ్యుల భూమిపైకి వచ్చి దౌర్జన్యం చేశారని త్రిమూర్తులు ఆరోపించారు. సీఎం కార్యాలయం నుంచి ఒత్తిళ్లు ఉన్నాయంటూ అత్యంత దౌర్జన్యంగా, దుర్మార్గంగా అధికారులు వ్యవహరించారంటూ ఆయన ధ్వజమెత్తారు. నిజానికి.. 2005లో తిప్పసాని మహాలక్ష్మి, నూనె శ్రీదేవిల నుంచి ఆ భూములను కొనుగోలు చేశామన్నారు. భూమి కొన్న సమయంలో రెవెన్యూ రికార్డులతో పాటు రిజి్రస్టేషన్ శాఖ ద్వారా కూడా అన్నీ పరిశీలించి ఎలాంటి వివాదాలు, ల్యాండ్ సీలింగ్ సమస్యలు లేవని తేలాకే ఆ భూమిని కొనుగోలు చేశామన్నారు.
చట్ట విరుద్ధంగా.. రాజకీయ కక్షతో..
ఇక సుమారు 19 ఏళ్లుగా తమ ఆ«దీనంలో ఉన్నాయని, రెవెన్యూ రికార్డులలో కూడా తమ పేర్లతో ఉన్నాయని ఆయన వివరించారు. అలాగే, ఆ భూములకు పన్నులు చెల్లిస్తున్నామని, చెరువులకు అనుమతులు కూడా ఇచ్చారని చెప్పారు. ఈ వాస్తవాలన్నీ పక్కన పెట్టి రాజకీయంగా తనను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో అధికారులు అప్పటికప్పుడు నోటీసు ఇచ్చి దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని త్రిమూర్తులు ప్రశి్నంచారు. ఇలాంటి విధ్వంసకర చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరన్నారు. సమయం వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారన్నారు. చట్ట విరుద్ధంగా రాజకీయ కక్షతో చేసిన ఈ వ్యవహారంపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని తోట త్రిమూర్తులు చెప్పారు. పార్టీ మారేందుకు ప్రయతి్నస్తున్నానంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment