అల్లు అర్జున్‌ ఇంటికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు | YSRCP MLC Thota Trimurthulu Meets Allu Arjun At His Residence In Hyderabad, Photo Viral | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్‌ ఇంటికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు

Published Sun, Dec 15 2024 5:30 PM | Last Updated on Mon, Dec 16 2024 11:30 AM

YSRCP MLC Thota Trimurthulu Meets Allu Arjun

సాక్షి, హైదరాబాద్‌: సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాట కేసులో జైలు నుంచి విడుదలై ఇంటికి వచ్చిన నటుడు అల్లు అర్జున్‌ను పలువురు ప్రముఖులు కలిశారు. ఆదివారం.. అల్లు అర్జున్‌ను వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిసి తన సంఘీభావం ప్రకటించారు. అనంతరం తోట త్రిమూర్తుల మీడియాతో మాట్లాడుతూ, జరిగిన ఘటన దురదృష్ట కరమన్నారు.నేషనల్ అవార్డు నటుడి పట్ల ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని తోట త్రిమూర్తులు అన్నారు.

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసులో శుక్రవారం ఉదయం అల్లు అర్జున్‌ను అరెస్టు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపర్చిన విషయం తెలిసిందే. కోర్టు రిమాండ్‌ విధించడంతో అల్లు అర్జున్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. మరో వైపు హైకోర్టు ఆయనకు సాయంత్రమే మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కానీ బెయిల్‌ పత్రాలు అందలేదని, సర్టిఫైడ్‌ కాపీలను తాము పరిగణనలోకి తీసుకోబోమని చెబుతూ జైలు అధికారులు.. అల్లు అర్జున్‌ను విడుదల చేయలేదు.

శనివారం ఉదయం విడుదల చేస్తామని ప్రకటించారు. దీనితో అల్లు అర్జున్‌ శుక్రవారం రాత్రి జైలులోనే ఉండాల్సి వచ్చింది. జైలులోని మంజీరా బ్యారక్‌లోని క్లాస్‌–1 గదిని అల్లు అర్జున్‌కు కేటాయించారు. అల్పాహారం అందించారు. శనివారం ఉదయం 6.15 గంటల సమయంలో జైలు అధికారులు అల్లు అర్జున్‌ను విడుదల చేశారు.

అల్లు అర్జున్‌ను శనివారం.. పెద్ద సంఖ్యలో ప్రముఖులు పరామర్శించారు. ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, రవి, దిల్‌రాజు, రవిశంకర్, జెమిని కిరణ్, నటులు వెంకటేశ్, నాగ చైతన్య, ఆర్‌.నారాయణమూర్తి, రానా, సు«దీర్‌బాబు, విజయ్‌ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ, అక్కినేని అఖిల్, అడవి శేష్, సంగీత దర్శకుడు తమన్‌ తదితర సినీ ప్రముఖులు అల్లు అర్జున్‌ నివాసానికి చేరుకుని పరామర్శించారు.

ఇదీ చదవండి: అల్లు అర్జున్‌, సీఎం రేవంత్‌ అరెస్ట్‌లో కామన్‌ పాయింట్ ఇదే: ఆర్జీవీ ట్వీట్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement