లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం | Family Attempts To End Their Lives In Narasaraopet, Mother And Child Dead, Doctor Husband Condition Critical | Sakshi
Sakshi News home page

లాడ్జీలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం

Mar 29 2026 2:35 PM | Updated on Mar 29 2026 4:32 PM

Tragedy At Palnadu District

సాక్షి,పల్నాడు జిల్లా: నరసరావుపేటలోదినేష్ గ్రాండ్ లాడ్జిలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఐదేళ్లు, మూడేళ్ళ కూతురుతో సహా దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. ఈ దుర్ఘటనలో తల్లి శంకర కుమారితో పాటు ఐదేళ్ల చిన్నారి మౌనిక ఇద్దరూ మృతి చెందారు. భర్త గోపి పరిస్థితి విషమంగా ఉండటం నరసరావుపేట ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. భార్యాభర్తలది నాదెండ్ల మండలం సాతులూరుగా పోలీసులు గుర్తించారు.  

భోపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో భర్త గోపీ డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా.. అదే ఆస్పత్రిలో భార్య శంకర కుమారి నర్సుగా పనిచేస్తున్నారు. నిన్న రాత్రి భోపాల్ నుంచి నరసరావుపేటకి వచ్చిన కుటుంబం అగాయిత్యానికి పాల్పడింది. దుర్ఘటనపై సమాచారం అందుకున‍్న పోలీసులు దంపతుల ఆత్మహత్యకు గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దంపతులు మత్తు ఇంజెక్షన్ చేసుకొని ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Advertisement
 
Advertisement
Advertisement