![We are vigilant on Omicron says Katamaneni Bhaskar - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/22/omicron.jpg.webp?itok=eBeTT619)
సాక్షి, అమరావతి: ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలను ముమ్మరం చేసిందని వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. ఒమిక్రాన్‌పై మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ మంగళవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు.
104 కాల్ సెంటర్ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఆస్పత్రులు, బెడ్లు, ఆక్సిజన్, మందులు సరిపడినన్ని అందుబాటులో ఉన్నాయని, విదేశీ ప్రయాణికుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. ఈ నెలలో ఇప్పటికే విదేశాల నుంచి వచ్చిన 30 వేలమందిని గుర్తించి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. సోమవారం నుంచి ఇంటింటి ఫీవర్‌సర్వే జరుగుతోందన్నారు. కరోనా లక్షణాలతో ఉన్నవారిని గుర్తించి వారికి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment