ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..! | Free Bus Travel Scheme Faces Criticism As Women Report Denied Boarding In AP, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫ్రీ బస్సు ఉత్తుత్తిదే..!

Apr 30 2026 8:03 AM | Updated on Apr 30 2026 11:35 AM

Women fires on RTC Rude Behavior

 స్టాప్‌ల వద్ద ఆపని వైనం

లాంటి ఫ్రీ బస్సు తమకు వద్దని మహిళల ఆవేదన

అనంతపురం జిల్లా:  చంద్రబాబు సర్కారు మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణమంటూ పథకాన్ని ఘనంగా ప్రారంభించినా..దానిలో చాలా కోతలు, నిబంధనలు పెట్టి దగా చేశారు. ఇప్పుడు  ఉన్న బస్సులు కూడా మహిళలను ఎక్కించుకోకుండానే వెళ్లిపోతున్నాయి. మహిళలు ఉన్నచోట బస్సులు సరిగా ఆపడం లేదు. ఇందుకు అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటనే తార్కాణం. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం క్రిష్టిపాడుకు చెందిన మహిళలు బుధవారం అనంతపురం వెళ్లడానికి గుత్తి ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చారు. బస్సులు పాయింట్‌లో ఆపలేదు. 

ఎదురు చూసిన మహిళలు ఆరా తీయగా బస్టాండ్‌ వెనుక వైపు నుంచే వెళ్లిపోతున్నట్టు గుర్తించారు. మహిళలు ఉన్న చోట బస్సులు ఆపడం లేదని వరలక్ష్మి, లక్ష్మి తదితర ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఫ్రీ బస్సు ప్రచారానికే పరిమితం కాకుండా.. మహిళలకు ప్రయోజనకరంఉండే విధంగా నడపాలని కోరారు. లేని పక్షంలో ఫ్రీ బస్సు ఎత్తేయండి అని మహిళలు వాపోయిన విషయాలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అయ్యాయి. 

Advertisement
 
Advertisement
Advertisement