
మృతి చెందిన రాజరాజేశ్వరి
తాడిపత్రి రూరల్: పట్టణంలోని నందలపాడులో నివాసం ఉంటున్న యువతి రాజరాజేశ్వరి (25) బుధవారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. రాజరాజేశ్వరికి తండ్రి లేడు. తల్లి చంద్రకళ, సోదరుడు ధనుంజయ రెడ్డితో కలిసి నందలపాడులో నివాసం ఉంటోంది. ఎంబీఏ పూర్తి చేసిన రాజేశ్వరి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఉద్యోగం దొరకక పోవడంతో మనస్తాపానికి గురయ్యేది.
కొద్ది రోజుల క్రితం రాజరాజేశ్వరితో పాటు తల్లి, సోదరుడికి కోవిడ్ సోకడంతో హోం ఐసోలేషన్‌లోనే ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం భోజనం అనంతరం రాజరాజేశ్వరి గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుంది. సాయంత్రం చీకటి పడుతున్నా బయటికి రాలేదు. తలుపులు పగులగొట్టి చూడగా ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పట్టణ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చదవండి: నేను చనిపోతున్నా.. కలకలం రేపిన యువకుడి మెసేజ్
‘కాలజ్ఞాని’ కుటుంబంలో కలహాలు
Comments
Please login to add a commentAdd a comment