
గుంటూరు,సాక్షి: ఎన్నికల ప్రచార సభలో భాగంగా వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనకాపల్లి జిల్లా చోడవరం చేరుకున్నారు. కాసేపట్లో కొత్తూరు జంక్షన్‌లో జరగబోయే ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారాయన.
అంతకు ముందు చోడవరం చేరుకున్న సీఎం జగన్‌కు పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతి, ఎమ్మెల్యే గణేష్, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి తదితరులు స్వాగతం పలికారు. ప్రజలకు అభివాదం చేస్తూ కొత్తూరు జంక్షన్ కు బయలుదేరారు సీఎం జగన్. జన నేత రాక సందర్భంగా కొత్తూరు జంక్షన్ జనసంద్రంగా మారింది.