
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ చేయూత పథకం జిల్లాలోని మహిళల ఆర్థిక స్వావలంబనకు, సాధికారతకు దోహదపడుతోందని, వారిలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో బహిరంగ సభ నుంచి వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ చేయూత సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ వీసీ హాలు నుంచి కలెక్టర్ విజయరామరాజు, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ సు«దీర్‌రెడ్డి, అడా చైర్మన్ గురుమోహన్, సగర ఉప్పర కార్పొరేషన్ చైర్ పర్సన్ రమణమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
∙ఈ సందర్భగా కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ఈ సాయం మొత్తాన్ని ప్రతి ఒక్కరూ తమ వ్యాపారానికి పెట్టుబడిగా ఉపయోగించుకోవాలన్నారు. వారు ఏ రంగంలో రాణించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ముందుకు సాగేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందించనుందన్నారు. కమలాపురం, బద్వేలు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు పి.రవీంద్రనాథ్‌రెడ్డి, డాక్టర్ సుధ, డాక్టర్ సు«దీర్‌రెడ్డిలు మాట్లాడుతూ మహిళా సాధికారత దిశగా సాగుతున్న ప్రభుత్వం.. అన్ని పథకాలకు మహిళలనే ప్రధాన అర్హులుగా గుర్తించారంటే.. ముఖ్యమంత్రి మహిళలకు ఎంతటి ప్రాధాన్యత ఇచ్చారో అర్థమవుతోందన్నారు. మీ నైపుణ్యంతో చేయగలిగిన ఏ పనైనా వ్యాపారంగా కొనసాగించి ముందుకు సాగవచ్చన్నారు. ప్రభుత్వం అందించే అన్ని సంక్షేమ పథకాలను మహిళలు అందిపుచ్చుకుని ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
∙కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ పెద్దిరాజు, జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి డాక్టర్ వి.బ్రహ్మయ్య, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఈడీ డాక్టర్ హెచ్.వెంకట సుబ్బయ్య, మైనార్టీ సంక్షేమశాఖ ఈడీ ఫరీద్‌సాహెబ్, సెర్ఫ్ ఉద్యోగులు, సంబం«ధిత సంక్షేమశాఖ అధికారులు, లబ్దిదారులైన మహిళలు తదితరులు పాల్గొన్నారు.
ఆర్థికప్రగతికి వారధిగా మారింది
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని పాలించడం అదృష్టంగా భావిస్తున్నాం. వైఎస్సార్ చేయూత ద్వారా మా సంఘంలో మహిళలందరికీ మూడో విడత ఆర్థికసాయం అందింది. ఆయన చేస్తున్న సాయం మా ఆర్థిక ప్రగతికి ఒక వారధిగా మారింది.
– బి.మార్తమ్మ, ప్రకాశ్‌నగర్, కడప
జగనన్న రుణం తీర్చుకోలేం
మహిళల సంక్షేమమే ధ్యేయంగా అన్ని రంగాల్లో వారికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రి జగనన్న రుణం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేం. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కరోనా కష్టంలోనే వైఎస్సార్ చేయూత పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయం.
–పి.గౌరీదేవి, వల్లూరు మండలం
సీఎం సేవలు వెలకట్టలేనివి
రాష్ట్రంలో పేద మహిళలందరికీ జగనన్న అన్నలా మారాడు. ఆడ పడుచులను కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఆయన చేసిన సాయం వెలకట్టలేనిది. జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్ ఆసరా, రైతు భరోసా పథకాలను ఇప్పటికే మా కుటుంబం అందుకుంటోంది. –
ఇ.సరిత, ఖాజీపేట మండలం
ప్రభుత్వ సంక్షేమ నీడలోనే బతుకుతున్నాం
మా కుటుంబం మొత్తం సీఎం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల నీడలో బతుకుతోంది. పెద్ద మనసున్న నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దయ వల్ల మా కుటుంబానికి వైఎస్సార్ చేయూత, అమ్మ ఒడి, వృద్ధాప్య పెన్షన్ అందుతోంది.
– ఎస్.ఫైజున్, వీరపునాయునిపల్లె మండలం
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు
మహిళలు లక్షాధికారులు కావాలన్న ప్రభుత్వ లక్ష్యం అభినందనీయం. నిరుపేద మహిళలకు వైఎస్సార్ చేయూత పథకం ఒక వరం. రెండో ఏడాది చేయూత లబ్ధి పొందుతున్న తాను వితంతు పెన్షన్ హౌస్ సైట్ పొందాను. మాట తప్పని ముఖ్యమంత్రిగా జగనన్న చరిత్రలో నిలుస్తారు.
– బి.మనోరహమ్మ, ఎర్రముక్కపల్లె, కడప
‘చేయూత’ అందకపోతే సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్
కలెక్టర్ విజయరామరాజు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 45–60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 90,369 మందికి వైఎస్సార్ చేయూత పథకం ద్వారా మూడో ఏడాది లబి్ధచేకూరిందన్నారు. ఇందులో ఎస్సీలు 24,432 మంది, ఎస్టీలు 2,340, బీసీలు 60,691, మైనారీ్టలు 2849, క్రిస్టియన్ ఫైనాన్షియల్ 120 మంది ఉన్నారన్నారు. వీరందరికీ ఒక్కొక్కరికి రూ. 18,750 చొప్పున మొత్తం రూ. 169,44,00,000 ఆర్థికసాయాన్ని విడుదల చేశారన్నారు. ఏ ఇతర కారణాల చేతనైనా వైఎస్సార్ చేయూత పథకం ద్వారా అర్హతలు ఉండి లబ్ధిపొందలేక పోయిన వారు సచివాలయాల్లో వలంటీర్ల ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చన్నారు.ముఖ్యమంత్రి ప్రసంగ కార్యక్రమం అనంతరం వైఎస్సార్ చేయూత పథకం కింద జిల్లా వ్యాప్తంగా 90,369 మందికి సంబంధించిన రూ. 169,44,00,000 మెగా చెక్కును ముఖ్య అతిథులతో కలిసి కలెక్టర్ అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment