విజయసాయి రెడ్డి జోక్యం చేసుకోవటం వల్లే విశాఖ శివార్లలోని భూములు ఆయన కుమార్తె, అల్లుడి కంపెనీకి తక్కువ ధరకు వచ్చాయని దారుణమైన అబద్ధాలు ప్రచురించటంపై ‘ఈనాడు’ను, దాని అధిపతి రామోజీరావును వైఎస్సార్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దుయ్యబట్టారు. ‘‘ఎందుకీ దౌర్భాగ్యపు రాతలు? అక్కడ ఉన్న ధరెంత? మా కుమార్తె, అల్లుడికి చెందిన కంపెనీ కొన్న ధర ఎంత? అక్కడ మిగతా వారు ఇప్పటికీ కొంటున్న ధర ఎంత? అవన్నీ కూడా చెప్పాలిగా? అబద్ధాలు చెబితే అడ్డంగా దొరికిపోతారనే ఇంగిత జ్ఞానం కూడా లేకపోతే ఎలా?’’ అంటూ మండిపడ్డారు.
విజయ సాయిరెడ్డి జోక్యం వల్లే అవతలి వ్యక్తులు మార్కెట్ ధరకన్నా మూడో వంతు ధరకు అమ్మేశారంటూ ‘‘విజయసాయిరెడ్డి గారి తడాఖా’’ అనే శీర్షికతో సోమవారం ‘ఈనాడు’ పత్రిక ఓ వార్తను ప్రచురించింది. ఈ వ్యవహారంపై విజయ సాయిరెడ్డి స్పందిస్తూ... ‘‘మా బంధువుల కంపెనీ కొన్న తరవాత కూడా... చాలామంది బయటి వ్యక్తులు అక్కడ అదే ధరకు కొన్నారు కదా? అదే సర్వే నెంబర్లో... అంతకంటే తక్కువ ధరకు కూడా కొందరు కొనుగోళ్లు చేశారు కదా? అవన్నీ రిజిస్ట్రేషన్ ఆఫీసు రికార్డుల్లో పారదర్శకంగా కనిపిస్తాయి కదా? రహస్యాలేమీ కాదు కదా? మీకు ఆ విషయాలేవీ తెలియవనుకోవాలా? లేదంటే వారంతా మీ బంధువులా? మీరు వెనకుండి చక్రం తిప్పారు కాబట్టే వారికి ఆ ధరకు వచ్చాయా? నాపై విషప్రచారమే ధ్యేయంగా ఎందుకీ పనికిమాలిన రాతలు?’’ అంటూ ఎండగట్టారు.
‘‘మీరు రాసిన దాని ప్రకారం చూస్తే... మా బంధువుల సంస్థ కొన్న భూమి 87,714 చదరపు గజాలు. దానికోసం వారు వెచ్చించిన మొత్తం 51.87 కోట్లు. అంటే ... సగటున చదరపు గజం విలువ రూ.6 వేలు. ఈ జాగా కూడా దాదాపు 25 భాగాల్లో విస్తరించి ఉంది. వీటిని కొనటానికి ఆ సంస్థకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది.
హైదరాబాద్ శివార్లలోని పాల్మాకుల గ్రామంలో ఏకంగా ఐదంటే 5 నెలల వ్యవధిలో 432 ఎకరాలు కొనేసిన మీరు... అది కూడా శంషాబాద్‌లో విమానాశ్రయం వస్తుందని ప్రకటించిన ఐదు నెలలకే మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన మీరు... వేరొకరిపై అసత్యాలు చెబుతూ ధర్మపన్నాలు వల్లించటాన్ని ఏమనుకోవాలి రామోజీ? ఇంతకంటే దిగజారుడు పని ఇంకేదీ ఉండదని ఇంకెప్పటికి తెలుస్తుంది మీకు? మీరు చెప్పినట్లుగా మా బంధువులు కొనుగోలు చేసిన సర్వే నెంబర్లలోనే... ఆ తరవాత ఎవరెవరో బయటివ్యక్తులు రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు.
మరి వారెంత ధరపెట్టారు? మీరు చెబుతున్నట్లుగా వీరికన్నా మూడింతల ధర పెట్టారా? లేదు కదా? మా వాళ్ల మాదిరే వాళ్లు కూడా గజం దాదాపుగా రూ.6వేల ధరకే కొన్నారు కదా? నిజానిజాలు తెలుసుకున్నాక వార్తలు రాయాలి కదా?’’ అని వ్యాఖ్యానించారు.
ఇది ఇన్‌సైడర్ ఎలా అవుతుంది రామోజీ?
‘‘2000వ సంవత్సరం సెప్టెంబర్లో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుందని చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన సరిగ్గా ఐదు నెలల్లో... అంటే 2001 ఫిబ్రవరి ముగిసేసరికి మీరు మీ మార్గదర్శి పేరిట, ఇతర బినామీల పేరిట శంషాబాద్ గ్రామానికి ఆనుకుని ఉండే పాల్మాకులలో ఏకంగా 432 ఎకరాలు కొనుగోలు చేసేశారు.
నిజానికి ఇన్ని వందల ఎకరాలు కొనాలంటే భూమి పరిశీలించటం, డాక్యుమెంట్లు చూడటం వంటి పనులకే చాలా సమయం పడుతుంది. కానీ చంద్రబాబు లీక్ చేసిన సమాచారంతో ముందే అంతా సిద్ధం చేసుకుని, ప్రకటన వెలువడిన వెంటనే రిజిస్ట్రేషన్లు ఆరంభించిన మీది కదా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటే..? దీన్ని ఎవరైనా కాదనగలరా?
ఇక మా బంధువుల విషయానికొస్తే... 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ వికేంద్రీకరణే మా విధానమని మా గౌరవ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి గారు చెబుతున్నారు. ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం, శాసన, న్యాయ రాజధానులుగా అమరావతి, కర్నూలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు.
ఇక విశాఖ శివార్లలో మా కుమార్తె, అల్లుడికి చెందిన సంస్థ ఈ భూములు కొన్నది 2001లో. అంటే ప్రకటన వెలువడిన రెండు సంవత్సరాల తరవాత. ఈ లోగా అక్కడ చాలామంది భూములు కొనుక్కున్నారు. ఇప్పటికీ కొంటున్నారు. దీన్ని ఎవరైనా ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనగలరా? మరీ ఇంత దారుణమైన రాతలెందుకు?’’ అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
రిజిస్ట్రేషన్ విలువల గురించి తెలియదా?
‘‘ఎక్కడ, ఎవరు భూములు కొన్నా... ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ ధర ఎంత ఉందో అంతకే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. వాస్తవంగా అక్కడ ఉండే ధర ఇంకాస్త ఎక్కువ ఉండి ఉండొచ్చు.
ఇంతటి కనీస పరిజ్ఞానం ‘ఈనాడు’కు లేదనుకోవాలా? మీరు, మీ కుటుంబ సభ్యులు వేల వేల ఎకరాలు కొన్నారు కదా? వాటిలో దేన్నయినా అప్పటికి అక్కడ వాస్తవంగా ఉన్న మార్కెట్ విలువకు కొన్నారా? దాన్ని రిజిస్ట్రేషన్ పత్రాల్లో చూపించారా? ఎందుకీ దౌర్భాగ్యపు రాతలు? పనిగట్టుకుని విష ప్రచారం చేయాలనుకుంటే నోటికొచ్చినట్లు రాసేసుకోవచ్చు.
అలా రాసుకోవటానికి కరపత్రాలో, లేదంటే ఏ సామాజిక మాధ్యమాలో పనికొస్తాయి. కానీ ప్రధాన స్రవంతిలో అందరూ చదివే పత్రికలో ఇలాంటి ఎల్లో రాతలు తగునా?’’ అంటూ రామోజీని దుయ్యబట్టారు.
ఇటీవల అక్కడ జరిగిన కొన్ని లావాదేవీల వివరాలివీ...
ఈ సందర్భంగా ఇటీవల అక్కడ జరిగిన లావాదేవీల వివరాలను విజయసాయిరెడ్డి ఉదాహరణగా చూపించారు. వీటిని బట్టే అక్కడ ఎవరు ఎంత ధర చెల్లిస్తున్నారో తెలుసుకోవచ్చునన్నారు. ‘‘మీరు చెప్పినట్లే 2021లో మా బంధువులు కొన్నారనుకుందాం. కానీ ఆ తరవాత చాలా మంది అదే సర్వే నెంబర్లలో భూములు కొనుక్కున్నారు. అందులో కొందరు స్థానిక తెలుగుదేశం నాయకులు కూడా ఉన్నారు.
మరి వారు కూడా అదే ధరకు కొన్నారు కదా? ఉదాహరణకు ఓ ఐదారు లావాదేవీలు చూద్దాం. ఇవన్నీ ఇటీవలి కాలంలో జరిగినవి. అంటే మీరు చెప్పిన మూడురెట్లను మించిన ధర ఉండాలి. కానీ వారు కూడా దాదాపుగా ఈ ధరే పెట్టారు. వాస్తవానికి అక్కడున్న రిజిస్ట్రేషన్ ధర అదే కాబట్టి... ఎవరైనా అదే పెడతారు. వీటిని చూస్తే మీ వాదన ఎంత పచ్చి అబద్ధమో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది కదా రామోజీ!’’ అంటూ ఆ వివరాలను వెల్లడించారు. అవి...
Comments
Please login to add a commentAdd a comment