
సాక్షి, అమరావతి: కరువు ప్రాంతంలో నీటి విలువ తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టే.. కరువు సీమను మెతుకు సీమగా మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. గండికోట, చిత్రావతి ప్రాజెక్ట్‌లు నిండాయని, నెల్లూరు సహా రాయలసీమ బీడు భూముల్లో నీరు పారుతోందన్నారు. నిర్వాసితుల త్యాగాలను ప్రభుత్వం గుర్తుపెట్టుకుంటోందని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. (చదవండి: దేవుడంటే నమ్మకం లేదు.. పాప భీతి లేదు..)