
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది పూర్తైన సందర్భంగా ఆయన ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ‘సీఎం వైఎస్ జగన్ తనెంత ప్రజాపక్షపాతో ఏడాదిలోనే నిరూపించకున్నారు. తమ కుటుంబ సభ్యుడే ముఖ్యమంత్రి పీఠంపై ఉన్నాడని ప్రజలు ధీమాగా ఉంటే, ఎన్నడూ లేనంత స్వేచ్ఛగా అధికార యంత్రాంగం పని చేస్తోంది. మోటివేట్ చేసే లీడర్ దొరికాడని ఉద్యోగులు గర్వపడుతున్నారు’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. (లంచాల మాట లేని ప్రభుత్వ పాలన: సీఎం జగన్)