సాక్షి, అమరావతి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ‘బాబు బీజేపీలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయిస్తాడు. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేస్తాడు. ప్రజలపై ఎందుకింత ద్వేషం? వీళ్ల వెనక ఉన్నదెవరు? అంటూ ప్రశ్నలు సంధించారు. (కన్నా.. కాణిపాకానికి ఎప్పుడొస్తున్నావ్?)
‘కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసే రిపోర్టులో కరోనా నియంత్రణ, చికిత్సకు తీసుకుంటున్న జాగ్రత్తల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. కొరియా కిట్లు వచ్చాక వ్యాధి కట్టడి ఇంకా తేలికవుతుంది. అయితే ప్రజలు నిశ్చింతగా ఉంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎక్కడ మంచి పేరొస్తుందోనని బాబు ఏడుపు.’ అంటూ ట్వీట్ చేశారు. (‘నేనెప్పుడూ అవినీతికి పాల్పడలేదు)
బాబు బిజెపిలోకి పంపిన సొంత మనిషి ప్రభుత్వ స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ఎందుకని కోర్టుకెళ్లి జీఓను కొట్టేయిస్తాడు. గ్లాసు పార్టీపై ఎంపీగా పోటీ చేసిన నేత కరోనా సమయంలో పోలవరం పనులెలా కొనసాగిస్తారని సుప్రీంలో పిటీషిన్ వేస్తాడు. ప్రజలపై ఎందుకింత ద్వేషం? వీళ్ల వెనక ఉన్నదెవరు?
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 23, 2020
Comments
Please login to add a commentAdd a comment