సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతల మనిషని, ప్రచారానికి ఆయనెప్పుడూ దూరమని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఏదైనా టాస్క్ విజయవంతమైతే సీఎం జగన్ ఆ క్రెడిట్‌ను అధికారులకిస్తారని, లోటుపాట్లుంటే ఆ బాధ్యతను తానే తీసుకుంటారని అన్నారు. సోమవారం ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి స్పందిస్తూ.. ‘‘ చంద్రబాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదిప్పుడు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదు. శవాలపై పేలాలు ఏరుకునే నైజాన్ని చంద్రబాబు ఎప్పటికీ వదిలిపెట్టడు. ఎల్లో మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, ఏడాది క్రితం కరోనా వైరస్ వచ్చుంటే బాగుండేదన్న క్రూరత్వం కనిపిస్తోంది. రాజకీయ మనుగడ కోసం ప్రజలు ఎప్పుడూ ఏదో ఒక ఉపద్రవంలో చిక్కుకోవాలనే స్వభావం బాబుది. ( ఇంతకంటే ప్రశంస ఇంకా ఏం కావాలి )
హుద్‌హుద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు బాబు దోచిపెట్టాడు. భూములు లేని వారికి నష్టం పరిహారం అందింది. నిజమైన బాధితులకు సీఎం జగన్ వచ్చాక న్యాయం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ చాన్స్ మిస్సయిందని బాబు ఏడుస్తున్నాడు. తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీద ఉండేలా డ్రామాలాడేవాడు. పుష్కరాల్లో 30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి అనుబవజ్ఞుడు, విజనరీ ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారు. కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే!’’ అంటూ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment