
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. అప్పుడెప్పుడో స్విట్జర్లాండ్ మంత్రి పాస్కల్ కూషెపిన్(Pascal Couchepin) బాబు లాగా కోతలు కోస్తే తమ దేశంలో మెంటల్ హాస్పిటల్‌కు పంపిస్తారని గాలి తీశాడు. అయినా కొంచెం కూడా మారలేదు. రాష్ట్రంలో 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గించాలని అప్పట్లో అధికారులను ఆదేశించడం పిచ్చి కాకపోతే మరేంటి? అంటూ వ్యంగ్యాస్రాలు సంధించారు. చదవండి: హైదరాబాద్ రమ్మంటారా.. విజయవాడ వస్తారా?
కాగా, మరో ట్వీట్‌లో.. 'గతంలో తమిళనాడు సీఎం జయలలిత కుమార్తెనని ఎవరో అమ్మాయి కోర్టుకెక్కడం, హీరో ధనుష్ తమ కుమారుడే అని ఇంకొకాయన హంగామా చేయడం చూశాం. పోతిరెడ్డిపాడు కట్టింది తనే అని చంద్రబాబు సిగ్గులేకుండా క్లెయిం చేసుకోవడం కూడా అలాంటి సంచలనమే. ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు.' అంటూ మండిపడ్డారు.
తాజా మరో ట్వీట్‌లో.. కరెంటు గురించి జగన్ గారికి అస్సలు అవగాహన లేదట. లక్ష కోట్ల ప్రజాధనాన్ని ప్రైవేటు విద్యుత్తు సంస్థలకు దోచిపెట్టడానికి ఒప్పందాలు చేసుకున్నారే, ఆ స్థాయి మేధస్సు నిజంగానే జగన్ గారికి లేదు. పైగా ఒప్పందాలను రద్దు చేయాలంటున్నాడు. ఇసుక నుంచి తైలం తీసే మీతెలివి ఆయనకెక్కడిది. అంటూ వ్యంగ్యాస్రాలు సంధించారు. చదవండి: టీడీపీ ప్రభుత్వం వస్తే వాళ్ల సంగతి చూస్తా
Comments
Please login to add a commentAdd a comment