
సాక్షి, తిరుపతి : పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో నిర్మాణంలో ఉన్న గడువ వారథి ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి పనులు వచ్చే ఏడాది ప్రారంభంలోనే పూర్తి అవుతాయన్నారు. గరుడ వారధి వల్ల శ్రీవారి భక్తులను అనేక ప్రయోజనాలు చేకూరనున్నాయని తెలిపారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా తిరుమలకు రావచ్చన్నారు. తిరుపతి వాసులకు కూడా ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని పేర్కొన్నారు. (‘కోలుకుంటున్న టీటీడీ అర్చకులు’)
అలాగే కరోనా నుంచి తిరుపతి అర్చకులు కోలుకున్నారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఇప్పట్లో దర్శనాల టికెట్ల సంఖ్య పెంచే ఆలోచనల లేదని స్పష్టం చేశారు. ఇప్పుడు రోజుకు 12 వేల టికెట్లు ఆన్‌లైన్‌లో పెడుతుంటే 9 వేలు మాత్రమే బుక్ అవుతున్నాయని పేర్కొన్నారు. ఆగస్ట్ 1తర్వాత కేంద్రం ఇచ్చే సూచనల ద్వారా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment