
సబ్‌స్టేషన్‌లో ఎగిసిపడుతున్న మంటలు
రామాపురం : రాయచోటి – వేంపల్లె రహదారి మార్గంలోని సూరకవాండ్లపల్లె వద్ద గల 132 కేవీ సబ్‌స్టేషన్‌లో మంగళవారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో అకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో సమీపంలోని ప్రజలు పరుగులు తీశారు. వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ సబ్‌స్టేషన్ నుంచి రాయచోటి నియోజకవర్గం చుట్టు పక్కల గల 47 విద్యుత్ సబ్‌స్టేషన్లకు (33/11కేవి) విద్యుత్ సరఫరాను అందిస్తున్నారు. ఈ ప్రమాదంతో విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సంఘటనపై రామాపురం ట్రాన్స్‌కో ఏఈ వరప్రసాద్‌రెడ్డిని వివరణ కోరగా సురకవాండ్లపల్లె సబ్‌స్టేషన్ నుంచి మండలంలోని అన్ని గ్రామాలకు విద్యుత్ సరఫరా అవుతుందన్నారు. సబ్‌స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు రావడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తెలిపారు.
● ఎగసిపడిన మంటలు
● పరుగులు తీసిన ప్రజలు
Comments
Please login to add a commentAdd a comment