ఆటో.. కారు ఢీకొని.. పలువురికి గాయాలు
మదనపల్లె : ఆటోను కారు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. మదనపల్లె ఎస్టేట్‌కు చెందిన బావాజాన్ (40) ఆటో డ్రైవర్‌గా జీవిస్తున్నాడు. సీటీఎం నుంచి ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా జెర్సీ పాలడెయిరీ సమీపంలో స్పీడ్‌బ్రేకర్ వద్ద వెనుక నుంచి వచ్చిన కారు ఆటోను వేగంగా ఢీకొంది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ బాబ్‌జాన్‌తోపాటు రామసముద్రం మండలం చింపరపల్లెకు చెందిన చిన్న అబ్బయ్య(61), అతని భార్య అలివేలమ్మ(55), మదనపల్లె పట్టణం బాలాజీనగర్‌కు చెందిన కౌసర్ (46), తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె పంచాయతీ చెరువుముందరపల్లెకు చెందిన వేమారెడ్డి (64) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం వేమారెడ్డి, అలివేలమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి రెఫర్ చేశారు.తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో,..
రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్‌ఐ వెంకట సుధాకర్‌రెడ్డి వివరాల మేరకు.. మండలంలోని ఓబుల్‌రెడ్డిగారి పల్లెకు చెందిన వెంకటసుబ్బరాయుడు, శ్రీనివాసులు, వెంకట సుబ్బరాయుడు జగనన్న కాలనీలో పనులు చేసేందుకు స్కూటర్‌పై వెళ్తున్నారు. రాయచోటి వైపు వెళ్తున్న కడపకు చెందిన మౌలాలి స్కూటర్‌పై వసుత్న్నారు. బండపల్లి పంచాయతీలోని జగనన్న కాలనీ సమీపంలో రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. రాయచోటి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల పోలీసులు తెలిపారు.
ద్విచక్రవాహనం ఢీకొని...
మదనపల్లె : ద్విచక్ర వాహనం ఢీకొని వ్యక్తి గాయపడిన సంఘటన చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగింది. పుంగనూరు మండలం ఏటవాకిలికి చెందిన శ్రీరాములు (48) వ్యక్తిగత పనులపై ద్విచక్రవానంలో పుంగనూరు పట్టణానికి వచ్చాడు. బిఆర్ థియేటర్ వద్ద ఎదురుగా వచ్చిన మరో ద్విచక్రవాహనం ఢీకొనడంతో శ్రీరాములు గాయపడ్డారు. స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నల్ల రిబ్బన్లతో వైద్య మిత్రల నిరసన
రాయచోటి జగదాంబసెంటర్ : డా.ఎన్‌టీఆర్ వైద్య సేవలో పనిచేస్తున్న వైద్య మిత్రలకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ మంగళవారం నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. వైద్యమిత్రలు మాట్లాడుతూ చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ జరగక, పిల్లలను చదివించుకోలేక ఇబ్బందిపడుతున్నామన్నారు. ఎన్‌టీఆర్ వైద్య సేవ పథకాన్ని బీమా మోడ్‌లోకి బదలాయించినా పథకంలో పని చేస్తున్న వైద్యమిత్రలు, టీం లీడర్లు, ఆఫీసు అసోసియేట్లు, జిల్లా మేనేజర్ తదితర క్షేత్ర స్థాయి సిబ్బంది ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు.
ఆటో.. కారు ఢీకొని.. పలువురికి గాయాలు
ఆటో.. కారు ఢీకొని.. పలువురికి గాయాలు
Comments
Please login to add a commentAdd a comment