వన్యప్రాణులు విలవిల! | - | Sakshi
Sakshi News home page

వన్యప్రాణులు విలవిల!

Published Fri, Feb 21 2025 9:04 AM | Last Updated on Fri, Feb 21 2025 9:01 AM

వన్యప

వన్యప్రాణులు విలవిల!

ఎండ తీవ్రతతో అల్లాడుతున్న మూగ జీవాలు

అడవిదాటుతున్న నేపథ్యంలో..ప్రాణాలకు ముప్పు

ప్రత్యామ్నాయం చేపట్టని సర్కారు

రాజంపేట: వేసవి ముంసుకోస్తోంది.. ఫిబ్రవరి మాసం నుంచే వన్యప్రాణులు దాహార్తితో అలమటిస్తున్నాయి.అడవిని దాటుతున్నాయి. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వన్యప్రాణుల సంరక్షణకు అన్ని చర్యలు తీసుకున్నారు. వీటి సంరక్షణకు అవసరమయ్యే నిధులను ఇప్పటి ప్రభుత్వం సరిపెట్టలేకపోతోందన్న అపవాదును మూటకట్టుకుంది. కంపానిధులు, బయోసాట్‌ పథఽకాల కింద నిధులు విడుదల కాలేదు. దీంతో నీటి ట్యాంకర్లతో నీటిని నింపేందుకు అటవీశాఖ ఆపసోపాలు పడుతోంది. వేసవిలో వన్యప్రాణులు సంరక్షణపై నీలినీడలు అలుముకున్నాయి.

రేంజ్‌లిలా..

వైఎస్సార్‌ జిల్లా రేంజ్‌ పరిధిలో కడప, ఒంటిమిట్ట, సిద్ధవటం, వేంపల్లె, ముద్దనూరు, ప్రొద్దుటూరు, వనిపెంట, పోరుమామిళ్ల ,బద్వేలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా పరిధిలో రాజంపేట, చిట్వేలి, సానిపాయి, బాలపల్లె, రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, పీలేరు రేంజ్‌లున్నాయి.

జనారణ్యంలోకి..

ఉభయ జిల్లాలో ఉన్న అభయారణ్యాల్లో వన్యప్రాణులు నీటి కోసం అలమటిస్తున్నాయి. అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. శేషాచలం, లంకమల అభయారణ్యం, పెనుశిల అభయారణ్యాల్లో వీటి దాహార్తి తీర్చేందుకు అటవీపల్లెల వైపు చూస్తున్నాయి. మరోవైపు అడవికి నిప్పురాజుకున్న క్రమంలో వన్యప్రాణాలు గందరగోళ పరిస్ధితులో పడి ప్రాణాలు కాపాడుకునేందుకు అటవీ శివారుపల్లె వైపు పరుగులు తీస్తున్నాయి. మరికొన్ని ఆహారం, నీటి కోసం కూడా వచ్చి ప్రాణాలు పొగుట్టుకుంటున్నాయి. గురువారం సిద్ధవటం రేంజ్‌లో ఇలాంటి సంఘటన చోటుచేసుకున్న సంగతి విధితమే.

● వేసవి ప్రారంభానికి ముందే ఫిబ్రవరి మాసంలోనే భానుడు ప్రచండ నిప్పులు చెరుగుతున్నాడు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఇక అటవీ ప్రాంతంలో గొంతు తడుపుకునేందుకు గుక్కెడు నీరు దొరకడం గగనంగా మారడం గమనార్హం.భానుడిసెగతో వన్యప్రాణులు విలవిల లాడుతున్నాయి.

పగలు కన్నా..రాత్రుల్లోనే నీటికోసం..

అటవీ ప్రాంతంలో ఉన్న వన్య ప్రాణులు పగలుకన్నా..రాత్రుల్లోనే నీటికోసం అటవీ గ్రామాల శివారుల్లోకి వచ్చేస్తున్నాయి. రాత్రి వేళలో తోటల్లోకి వచ్చి నీటి కోసం పరుగులు తీస్తున్నాయని ప్రత్యక్షంగా చూసిన రైతులు అంటున్నారు. వీటి వల్ల తోటలకు ఎటువంటి హాని ఉండదని, ఏనుగులతో హాని ఉంటుందని చెబుతున్నారు. తెల్లవారుజాము వరకు మైదాన ప్రాంతంలోనే దాహార్తి తీర్చుకొని సేద తీరుతుంటాయి. గుక్కెడు నీటి కోసం పక్షులు, జంతువులు నీటి చలమలను వెతుకొంటూ వస్తున్నాయి.

జిల్లా రేంజ్‌లు విస్తీర్ణం(హెక్టారు)

అభయారణ్యాలు: శేషాచలం,

లంకమల, పెనుశిల, నల్లమల

వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు చర్యలు

వన్యప్రాణాలు దాహార్తి తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.ఫిబ్రవరి నుంచి వేసవి పరిస్ధితులు తీవ్రంగా ఉన్నట్లు కనిపిస్తోంది. సాసర్‌పిట్‌, నీటి కుంటల్లో నీటిని నింపుతాము. 130 సాసర్‌పిట్స్‌లో రెండురోజులకొకసారి నీటితో నింపుతున్నాం. వన్యప్రాణులతో పాటు అడవులను కాపడుకునే బాధ్యత తీసుకున్నాం. –జగన్నాథ్‌సింగ్‌,

జిల్లా అటవీ అధికారి, రాజంపేట

వైఎస్సార్‌ 9 2లక్షల94వేలు

అన్నమయ్య 8 2లక్షల74వేలు

No comments yet. Be the first to comment!
Add a comment
వన్యప్రాణులు విలవిల! 1
1/2

వన్యప్రాణులు విలవిల!

వన్యప్రాణులు విలవిల! 2
2/2

వన్యప్రాణులు విలవిల!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement