పి–4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
రాయచోటి: పేదరిక నిర్మూలన – పి4 సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, వాట్సాప్ పరిపాలన ద్వారా ప్రజలకు అత్యంత చేరువలో సేవలు ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఏపీపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్–2 పరీక్ష, పేదరిక నిర్మూలన – పి4 సర్వే, ఇంటర్మీడియట్ పరీక్షలు, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్, వాట్సాప్ పరిపాలన, ఎమ్మెస్‌ఎంఈ సర్వే, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌ఓ మధుసూదన్ రావు, సిపిఓ వెంకట్, డీఈఓ సుబ్రమణ్యం, మున్సిపల్ కమీషనర్ వాసు తదితర అధికారులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్
Comments
Please login to add a commentAdd a comment